కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాపై చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నట్లున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ పదిసీట్లు గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇపుడున్న నాలుగు సిట్టింగ్ స్ధానాలకు అదనంగా మరో ఆరు సీట్లలో గెలవాలని అమిత్ షా సమీక్షలో కచ్చితంగా చెప్పారు. 35 శాతం ఓట్ల షేరుతో బీజేపీ పదిసీట్లలో గెలవాల్సిందే అని స్పష్టంగా ఆదేశించారు. ఒక్కరోజు పర్యటన కోసం ఢిల్లీ నుండి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా నలుగు ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురం అర్వింద్, సోయం బాబూరావుతో పాటు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితర సీనియర్లతో మాట్లాడారు. సిట్టింగ్ స్ధానాల్లో మళ్ళీ నలుగురు పోటీచేయాల్సిందే అని చెప్పేశారు. మిగిలిన ఆరు స్ధానాలతో పాటు మిగిలిన ఏడు స్ధానాల్లో కూడా అంటే 13 స్ధానాల్లో బలమైన అభ్యర్ధులను పోటీలోకి దింపాలని చెప్పారు. ఇందుకోసం గట్టి అభ్యర్ధుల వేట మొదలుపెట్టాలని చెప్పారు. పార్టీ నేతలంతా ఏకతాటిపైన పనిచేస్తే గెలుపు అంత కష్టంకాదన్నారు.
2018 ఎన్నికల్లో కేవలం ఒక్క అసెంబ్లీకే పరిమితమైన బీజేపీ తాజా ఎన్నికల్లో 8 సీట్లలో గెలవటాన్ని ప్రస్తావించారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో రెండోస్ధానంలో ఉన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఇప్పటినుండే అభ్యర్ధుల గెలుపుకోసం పార్టీ నేతలు, క్యాడర్ మొత్తం కష్టపడితే పార్టీకి 35 శాతం ఓట్లు షేర్ రావటం కష్టంకాదని అమిత్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో అమిత్ షా తెలంగాణా ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు.
అమిత్ చెప్పిన లెక్కలన్నీ పేపర్ మీద చూడటానికి బాగానే ఉంటుంది కాని గ్రౌండ్ లెవల్లో ఎంతవరకు పనిచేస్తుంన్నది పెద్ద అనుమానం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ప్రజాపాలన మొదలుట్టారు. సిక్స్ గ్యారెంటీస్ అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రజావాణి కార్యక్రమంతో జనాలకు దగ్గరవుతున్నారు. సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఈ పరిస్ధితుల్లో బీజేపీకి పదిసీట్లు వస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on December 29, 2023 10:58 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…