Political News

మోడీతో మొహ‌మాటం.. జ‌గ‌న్ ఏం చేస్తారో…!

రాజ‌కీయాల్లో మొహ‌మాటాల‌కు తావులేదు. ఉంటే ఎంత క‌ష్ట‌మో.. ఎన్నిక‌ల వేళ ప‌లు పార్టీల‌కు అనుభ‌వ మే. అయినా కూడా ఒక్కొక్క‌సారి మొహ‌మాటం త‌ప్ప‌దు. ఏం చేస్తారు..? బ‌ల‌మైన నేత‌లు తార‌స ప‌డిన ప్పుడు స‌ర్దుకు పోవాల్సి ఉంటుంది. అయితే.. ఇలా స‌ర్దుకు పోయే సంద‌ర్భంలో ఎదుర‌య్యే ప‌రిణామాల ను ఎలా డీల్ చేయాల‌నేది కూడా కీల‌క‌మే. ఈ విష‌యంమే ఇప్పుడు వైసీపీకి చిక్కుగా మారింది.

దేశంలో కీల‌క‌మైన ఘ‌ట్టం మ‌రికొన్ని రోజుల్లోనే ఆవిష్కృతం కానుంది. అదే.. యూపీలోని అయోధ్య రామ‌మందిరంలో శ్రీరాముడి విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మం. దీనికి దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ఆహ్వానించారు. మ‌రోవైపు.. అయోధ్య రామ‌జ‌న్మ భూమి ట్ర‌స్టు కూడా.. ఆహ్వాన ప‌త్రిక‌లు పంపించింది. ఈ ఆహ్వాన ప‌త్రిక తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు కూడా అందింది.

అదే స‌మ‌యంలో ప్ర‌ధాని నుంచి క‌బురు రానుంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ అయోధ్య‌కు వెళ్లాలా? వ‌ద్దా.? అనే మీమాంస ఏర్ప‌డింది. వెళ్తే.. ఆయ‌న‌కు మైనారిటీ ఓటు బ్యాంకు ప్ర‌భావం ప‌డుతుందనే చ‌ర్చ జ‌రుగుతోంది. పైగా బీజేపీ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మం కావ‌డంతో ఇది మ‌రింత ఎక్కువ‌గా ఎన్నిక‌ల్లో రిఫ్లెక్ట్ అవుతుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు వెళ్ల‌క‌పోతే.. మోడీ ఆహ్వానాన్ని ధిక్కరించార‌న్న చెడ్డ‌పేరు.

వెర‌సి.. ఈ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌కు రావాలా? అనేది ఇప్పుడు జ‌గ‌న్ ప‌డుతున్న ఆవేద‌న‌. ఇదిలావుంటే.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళ‌నాడు, ఢిల్లీ సీఎంలు స్టాలిన్‌, కేజ్రీవాల్‌లు ఇప్ప‌టికే.. తాము ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం లేద‌ని.. రాముడిని రాజ‌కీయాల కు వాడుకుంటున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on December 29, 2023 8:38 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

6 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

8 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

9 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

9 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

10 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

10 hours ago