ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ మరో ఛాన్స్ దక్కించు కుంటుందా? లేక పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని భావిస్తున్న టీడీపీ-జనసేనలు ఉమ్మడిగా అధికారం సాధిస్తాయా? పొత్తు ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇదీ.. కొన్నాళ్లుగా రాజకీయంగా జరుగుతున్న తీవ్రమైన చర్చ. ఇక, సాధారణ ప్రజానీకంలోనూ ఇటు పొత్తు, అటు ఒంటరి(వైసీపీ) పోటీపై అనేక అంచనాలు వస్తున్నాయి.
సాధారణంగా ఒక పార్టీకి మరో పార్టీ జత కడితే.. అంచనాలు భిన్నంగానే ఉంటాయని అందరూ భావిస్తారు. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి నేతలు..తమదే అధికారమని చెబుతున్నారు. ఇంకోవైపు వైసీపీ మంత్రులు, నాయకులు ఎవరు ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. అధికారం జగన్‌కే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జననేతగా ఆయనను ఢీకొట్టే వారు లేరని కూడా చెబుతున్నారు. అయితే.. ఈ చర్చ కొనసాగుతున్న సమయంలోనే తాజాగా ఓ సంచలన సర్వే తెరమీదికి వచ్చింది.
అదే.. “జన్ మాట” పోల్ సర్వే. ఈ సర్వేకు చాలా విశ్వసనీయత ఉండడం గమనార్హం. ముందుగా ఇది చేసిన సర్వే గురించి చెప్పుకొందాం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక సర్వేలు వచ్చాయి. అన్ని సర్వేలు కూడా.. కాంగ్రెస్‌కు మెజారిటీ మార్కుకు దిగువన 60 లేదా 57 సీట్లు మాత్రమే దక్కుతాయని అన్నారు. మరికొన్ని బీఆర్ ఎస్‌కు ఏకపక్షంగా వస్తాయని చెప్పాయి. కానీ, జన్ మాట సర్వే మాత్రం కాంగ్రెస్‌కు 61-63 సీట్లు వస్తాయని పేర్కొంది.
ఈ సంస్థ చెప్పినట్టే కాంగ్రెస్ కు మరో సీటు ఎక్కువగా 64 స్థానాలు దక్కాయి. దీంతో ఎలాంటి శషభిషలు లేకుండానే కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇక, బీఆర్ ఎస్‌కు 45-47 వస్తాయని పేర్కొనగా 34 సీట్లకే పరిమితమైంది. బీజేపీకి 4-5 వస్తాయని చెప్పగా 8, ఎంఐఎంకు 6-7 స్థానాలని పేర్కొనగా.. 6 చోట్ల విజయందక్కించుకుంది. సో.. దీనిని బట్టి జన్ మాట సర్వేకు విశ్వసనీయత బాగా పెరిగింది.
ఇప్పుడు ఇదే జన్ మాట .. సర్వే.. టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించాక.. ఏపీలో సర్వే చేసింది. 2024లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం..
2024 ఎన్నికలలో
116-118 సీట్లలో వైసీపీ గెలవనుంది
46-48 సీట్లను టీడీపీ+జనసేన కైవసం చేసుకోనున్నాయి. సో.. దీనిని బట్టి.. ఈ సర్వే సంస్థ చెప్పినట్టుగానే తెలంగాణ ఫలితాలు కూడా వచ్చాయి కనుక.. రానున్న 2024లో ఏపీలో వైసీపీ మరోసారి విజయఢంకా మోగించడం.. జగనే సీఎం కావడం.. సరికొత్త రికార్డు సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
This post was last modified on December 28, 2023 6:43 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…