వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారంపై ఏపీ అధికార పార్టీలో కీలకచర్చగా మారింది. కొందరిని తీసేయడం.. మరికొందరిని చేర్చడం వంటివి ఆసక్తిగా ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు నొచ్చుకుంటుండగా.. మరికొందరు సర్దుకుపోతున్నారు. ఇలాంటివారిలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా ఉన్నారు. ఈయనకు టికెట్ ఇవ్వకుండానే.. లేదా ఇవ్వబోమని చెప్పకుండానే.. “నేను పోటీ చేయను” అని ప్రకటించారు. ఈ ఆకస్మిక వసంత గానం మార్పుపై పార్టీలోనూ చర్చ జరుగుతోంది
2019 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలోనే ఉన్న వసంత కృష్ణ ప్రసాద్.. మైలవరం టికెట్ ఆశించారు. దీనికి టీడీపీ ససేమిరా అనడంతో అప్పటికప్పుడు వైసీపీలోకి వచ్చారు. మొత్తానికి టికెట్ దక్కించుకున్నారు. జగన్ సునామీ, పాదయాత్ర ప్రభావంతో విజయం దక్కించుకున్నారనే టాక్ ఉంది. ఇక, ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే.. సొంత సామాజిక వర్గమే ఆయనకు దూరమైంది. గత ఎన్నికల్లో టీడీపీని కాదని.. వసంతకు జై కొట్టిన కమ్మ వర్గం.. ఇప్పుడు పూర్తిగా ఆయనను దూరం పెట్టింది.
ఈ విషయంలో పార్టీకంటే కూడా.. వసంత వైపే తప్పులు కనిపిస్తున్నాయనే చర్చ ఉంది. తనను గెలిపించిన వారిని కనీసం ఆదరించకుండా.. వైరి పక్షం టీడీపీ నేతలతో ఆయన చేతులు కలిపారనే వాదన ఉంది. అదేసమయంలో సొంత పార్టీ నాయకులతోనూ ఆయన కయ్యాలకు దిగడం.. చీటికీ మాటికీ.. పంచాయతీలు పెట్టుకోవడం వంటివి వ్యక్తిగతంగా వసంతకు మైనస్ మార్కులు పడేలా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టికెట్ రాదనే ప్రచారం ఉంది.
అయితే. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇస్తామని, ఇవ్వబోమని చెప్పలేదు. కానీ, ఇంతలోనే వసంత తన స్వరం మార్చుకుని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఇటీవల రెండు సార్లు ప్రకటించుకున్నారు. అయితే.. ఇది వ్యూహాత్మకంగా చేసిన వాదనేనని కొందరు చెబుతున్నా రు. ఇలా పోటీకి దూరమవుతున్నానని చెప్పడం ద్వారా సింపతీ గెయిన్ పాలిటిక్స్ ఉన్నాయని అంటున్నారు. ఇదిలావుంటే.. మైలవరం టికెట్‌ను వసంతకే వైసీపీ కన్ఫర్మ్ చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 28, 2023 9:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…