Political News

రాధాకు పెరుగుతున్న పొలిటిక‌ల్ స్పేస్‌.. !

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్న ద‌రిమిలా.. వంగ‌వీటి రంగా వార‌సుడు రాధాకు కూడా.. రాజ‌కీయ స్పేస్ పెరుగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలో ఉన్నారు. అయితే ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌నే విష‌యంపై క్లారిటీ లేదు. ఆయ‌న కూడా పార్టీపై ఒత్తిడి తేవ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేసిన ఓకే అన్న వైసీపీ.. రాధా కోరుకున్న విజ‌య‌వాడ‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. రాజ‌ధాని ఉద్య‌మంలోనూ పాల్గొన్నారు. మొత్తంగా.. కొన్ని రోజులు యాక్టివ్‌గా ఉన్నా.. మ‌రికొన్ని రోజులు.. మౌనంగానే ఉండిపోయారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. టీడీపీలో ఉన్నా.. ఆయ‌న వైసీపీ నాయ‌కుల‌తో చెలిమి చేస్తుండ‌డం మ‌రో చిత్ర‌మైన ప‌రిణామం. ఇది కూడా కొన్నాళ్ల కింద‌ట రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీసింది. ఇలాంటి చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు.. తాను టీడీపీలోనే ఉన్నాన‌ని చెప్పుకోవ‌డం మిన‌హా ఆయ‌న చేసింది లేదు.

ఇదిలావుంటే.. ఇప్పుడు వంగ‌వీటి రాధాకు రెండు కీల‌క పార్టీల నుంచి పిలుపు వ‌స్తోంది. దీనిలో ఒక‌టి.. కాంగ్రెస్ పార్టీ. రంగా త‌మ‌వాడేన‌ని చెబుతున్న కాంగ్రెస్‌.. రాధాకు రెడ్ కార్పెట్ ప‌రుస్తామ‌ని.. విజ‌య‌వాడ ప‌గ్గాలు అప్ప‌గిస్తామ‌ని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెస్తామ‌ని రాయ‌బారం న‌డుపుతోంది. అంతేకాదు.. కోరుకున్న చోట టికెట్ ఇస్తామ‌ని కూడా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఈ విష‌యంలో పార్టీ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు దూకుడుగా ఉన్నారు.

గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోని నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. 10 స్థానాల్లో ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే రాధాకు పిలుపు వ‌స్తోంద‌ని తెలిసింది. మ‌రోవైపు.. వైసీపీ నుంచి కూడా రాధాకు పిలుపు అందుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపుల ఓటు బ్యాంకు కీల‌కంగా మార‌నున్న నేప‌థ్యంలో రంగా వ‌ర్గాన్ని త‌మవైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్న పార్టీ.. రాధాను తిరిగి వ‌చ్చేలా చేసే బాధ్య‌ను ఓ ఫైర్‌బ్రాండ్‌కు అప్ప‌గించిన‌ట్టు చ‌ర్చ‌సాగుతోంది.

This post was last modified on December 27, 2023 9:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

2 hours ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

2 hours ago

బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!

అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…

3 hours ago

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

4 hours ago

తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఇదా?

ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…

4 hours ago

రవితేజ-శ్రీలీల.. మళ్లీ ఫైరే

మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…

5 hours ago