వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డికి వైసీపీ నేతల నుంచి భారీ సెగ తగిలింది. ప్రస్తుతం పార్టీలో టికెట్ల రగడ కొనసాగుతున్న నేపథ్యంలో టికెట్ దక్కదని భావిస్తున్నవారు తమ అనుచరులతో నిరసనలకు దిగుతున్నా రు. అయితే.. ఇది ఇప్పటి వరకు నియోజకవర్గాలకే పరిమితం అయింది. దీంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నవారి విషయాన్ని సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుచరులు మినీ బైపాస్‌మీదే సాయిరెడ్డిని అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు.
రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి గూడూరు మీదుగా నెల్లూరు వెళ్తున్న వైసీపీ రీజినల్(నెల్లూరు, ప్రకాశం జిల్లాలు) కో-ఆర్డీనేటర్ విజయ్ సాయి రెడ్డిని గూడూరు మినీ బైపాస్‌లో ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య సహా ఆయన అనుచరులు కలిశారు. కలివేటి సంజీవయ్యకే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆయన పేదల పక్షపాతి అని.. ఆయనను తప్పిస్తున్నట్టు వార్తలు వస్తున్నా యని.. ఏది నిజమో చెప్పాలని నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో సాయిరెడ్డి ఖిన్నుడై.. పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు. అంతా సీఎం జగన్ అభీష్టం మేరకే జరుగుతుందని తేల్చి చెప్పారు.
మరోవైపు ఇదే సమయంలో కలివేటి సంజీవయ్య వ్యతిరేక వర్గం కూడా సాయిరెడ్డిని చుట్టుముట్టింది. సంజీవయ్యకు టికెట్ ఇవ్వొద్దని నినాదాలు చేసింది. ఆయనకు టికెట్ ఇస్తే.. పార్టీ నుంచి వెళ్లిపోతామని వ్యాఖ్యానించడంతో కాసేపు గందరగోళం నెలకొంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో విభేదాలు వాస్తవమే, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం మంచిది కాదని, అభ్యర్థి ఎంపిక విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిదే నిర్ణయమని వారికి విజయ్ సాయిరెడ్డి స్పష్టం చేశారు. అయినా.. నిరసనలు కొనసాగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింప జేశారు.
This post was last modified on December 26, 2023 9:22 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…