మహిళలే మహా మంత్రం. వచ్చే ఏపీ ఎన్నికల్లో వారే కీలకంగా మారనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు.. ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. ముఖ్యంగా పల్లెలు, పట్టణాల్లో.. మహిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా పడింది. ఇదే ఆ పార్టీకి పదేళ్ల తర్వాత.. విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ మహిళలను మచ్చిక చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
అయితే.. ఈ క్రమంలో ఎవరు ముందు? ఏ పార్టీ వ్యూహం ఏంటి? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. వైసీపీ ని తీసుకుంటే.. ఇప్పటికే మహిళల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న ఇళ్లు వంటివి హైలెట్‌గా నిలుస్తున్నాయి. వీటిని మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాత్మకంగా మహిళలను సెంట్రిక్‌గా చేసుకుని అదే అమ్మ ఒడిని ఇంట్లో ఉన్న అందరి పిల్లలకు వర్తింప జేస్తామని చెప్పింది.
ఇక, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎక్కడ నుంచి ఎక్కడకైనా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తామని అంటోంది. దీంతో వైసీపీ ఈ రెండు పథకాలపైనా దృష్టి పెట్టింది. త్వరలోనే మహిళలకు ప్రత్యేకంగా.. ఈ ప్రభుత్వ హయాంలోనే బస్సులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరి తొలి వారంలో నగరాల్లో మహిళలకు ప్రత్యేకంగా.. పదేసి బస్సుల చొప్పున ప్రవేశ పెట్టేందుకు వైసీపీ సర్కారు దృష్టి పెట్టింది.
అంటే.. ఎన్నికల సమయానికి బస్సులు ప్రవేశ పెట్టి.. సెల్ఫ్ గోల్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలావుంటే.. మరోవైపు.. మహిళలకు ఇచ్చిన పథకాలపై మరింత విస్తృత ప్రచారం చేసుకునేందుకు వైసీపీ రంగం రెడీ చేసింది. ప్రతి మహిళనూ వైసీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేసింది. టీడీపీ కూడా.. మహిళా సాధికారతకు పెద్దపీట వేసేలా.. మరో కీలక పథకాన్ని ప్రవేశ పెట్టేం దుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కోటా ప్రకటించాలని నిర్ణయించింది. మొత్తానికి మహిళల కేంద్రంగారాజకీయాలు తెరవెనుక సాగుతుండడం గమనార్హం.
This post was last modified on January 6, 2024 5:50 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…