వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్‌దక్కుతుందా? లేక ఆయన స్థానంలో వేరే వారి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. మొదట ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలు ప్రారంభంచిన వెలంపల్లి 2009లో తొలిసారే విజయం దక్కించుకున్నారు. తర్వాత.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో బీజేపీ బాట పట్టారు.
ఈ క్రమంలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019కి ముందు వైసీపీలోకి వచ్చిన వెలంపల్లి.. ఆ ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు.. వైశ్య సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవిని కూడా సొంతం చేసుకున్నారు. రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో ఆయనను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. మరోసారి ఆయన పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా.. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కేడర్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే వెలంపల్లికి ఆరంభం నుంచి సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ఉందనే ప్రచారం ఉంది. ప్రధానంగా కొందరు కార్పొరేటర్లు వెలంపల్లి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం తన వర్గం(వైశ్య వర్గా నికి చెందిన బడా వ్యాపారులు) వాళ్లనే ఎమ్మెల్యే ప్రోత్సహిస్తూ అన్ని పనులు చేయించుకుంటున్నా రనే ది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. పైగా తనను ప్రశ్నించిన వారు ఎవరైనా సరే పోలీసు కేసులు పెట్టిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వెలంపల్లి పోటీ చేసినా ఓడిస్తామనే గళాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ టికెట్‌ను వేరేవారికి ఇస్తారని, అది కూడా మైనారిటీ ముస్లిం వర్గానికే కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో నిమ్రా విద్యా సంస్థల అధినేత రసూల్‌ఖాన్ పేరు వినిపిస్తుండడం గమనార్హం.
అంతేకాదు.. స్థానికంగా పశ్చిమ నియోజకవర్గంలో రసూల్ ఖాన్ పేరుతో బ్యానర్లు వెలియడం మరింతగా రాజకీయ కాక పుట్టిస్తోంది. దీంతో వెలంపల్లికి టికెట్ టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడం గమనార్హం. ఇక్కడ కలిసి వస్తున్న పరిణామం ఏంటంటే.. సీఎం జగన్‌కు వెలంపల్లి ఆప్తుడు కావడమే!!
This post was last modified on December 26, 2023 10:02 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…