తెలంగాణలో ప్రభుత్వం మారింది. తమనే గెలిపిస్తారని.. తాము చేసిన అబివృద్ధి దేశంలో ఎక్కడా ఎవరూ చేయడం లేదని.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని. పదే పదే చెప్పుకొన్న కేసీఆర్‌ను ప్రజలు పక్కన పెట్టేశారు. ఎన్నో సెంటిమెంట్లు ప్లే చేసినా.. వాటిని కూడా ప్రజలు పట్టించుకో లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రెండు అంశాలను కీలకంగా తీసుకున్న కేసీఆర్.. అవైనా తమను గట్టెక్కిస్తాయని అనుకున్నారు. అయితే.. అవి కూడా ఫలించలేదు.
అవే.. ఒకటి సర్వేలు. రెండు సొంత మీడియా. సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికలకు ఆరు మాసాల నుంచి అనేక సర్వేలు చేయించారు కేసీఆర్. తను సొంతగా చేయించుకున్న సర్వేతోపాటు.. ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా.. ఆయన అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరు.. పథకాల జోరు.. ప్రజల నాడిని పట్టుకునేందుకు .. కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అంతేకాదు.. ఇంటిలిజెన్సును కూడా గ్రామ గ్రామానా తిప్పారు. అయితే.. సర్వేలన్నీ ఆయనకు అనుకూలంగానే వచ్చాయి.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలోనూ .. ఇదే సర్వేలు వచ్చాయి. దీంతో కాదని అన్న స్థానాల్లోనూ సిట్టింగులకే సీట్లు ఇచ్చారు. తీరా ఫలితం రివర్స్ అయింది. మరోవైపు.. కేసీఆర్‌కు సొంత మీడియా ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(ఇంగ్లీష్) పత్రికలతోపాటు.. టీ న్యూస్ చానల్ కూడా ఉంది. ఈ మీడియా ద్వారా.. నిరంతరం.. కేసీఆర్‌పై కథనాలు ప్రచారం చేశారు. అభివృద్ధిని వివరించారు. ఇక, సెంటిమెంటుకు హద్దు అదుపు లేకుండా చేశారు. అయినా.. ప్రజలు వీటిని పట్టించుకోలేదు.
కట్ చేస్తే.. ఏపీలోనూ ప్రధాన పార్టీలు మీడియా, సర్వేలనే నమ్ముతున్నాయి. పైకి.. ఏమీ తెలియనట్టుగా ఉన్నా.. టీడీపీ, వైసీపీలు సర్వేలు చేయిస్తున్నాయి.. అనుకూల మీడియాలను కూడా నమ్ముకున్నాయి. మరి వీటి ప్రకారం మార్పులు చేర్పులు చేస్తారా? లేదా.. ఏం చేస్తారనేది చూడాలి. కానీ, తెలంగాణలో వచ్చిన ఫలితాన్ని చూస్తే.. సర్వేలు.. మీడియా పార్టీలను కాపాడతాయా? లేదా? అనేది వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on December 26, 2023 9:45 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…