ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తిగా మారాయి. ఇప్పటికే వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు కలిసి వచ్చే పార్టీలను టీడీపీ అక్కున చేర్చుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జనసేనతో టీడీపీ జతకట్టింది. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలూ కూడా కలిసి పోటీ చేయనున్నాయి. ఇక, ఇప్పుడుమరో సంచలనం చోటు చేసుకుంది.
ఆది నుంచి టీడీపీ వ్యతిరేకిస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం చంద్రబాబు కుటుంబానికి జై కొట్టినట్టుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా క్రిస్మస్ను పురస్కరించుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..టీడీపీ యువనాయకుడు నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పడం, మిఠాయిలు పంపించడం.. గ్రీటింగ్ కార్డు పంపడం.. క్రిస్మస్ కేకును పంపించి.. నారా కుటుంబం వచ్చే ఏడాదిలో ఆనందంగా ఉండాలని ఆశించడం వంటివి రాజకీయంగా ప్రాదాన్యం సంతరించుకున్నాయి.
వాస్తవానికి ఏపీలో ఉన్నది వైఎస్ షర్మిల సోదరుడి ప్రభుత్వం. అయితే.. ఈ ప్రభుత్వాన్ని దించేసి.. తాము అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా షర్మిల వ్యవహరించిన తీరుతో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయనే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల వేళ.. షర్మిల తమకు పంపించిన గ్రీటింగ్స్‌ను టీడీపీ ప్రజాక్షేత్రంలో వెల్లడించే అవకాశం ఉంది.
దీంతో వైఎస్ సానుభూతిపరులు.. టీడీపీవైపు మొగ్గే చాన్స్‌ను కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీల కులు. ముఖ్యంగా క్రిస్టియన్ ఓట్లు.. కూడా ఈ ప్రభావానికి గురి కావొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. గత ఎన్నికల్లో ఇదే సమయంలో జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల, ఆమె భర్త.. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం.. వైఎస్ కుటుంబానికి వైరం పక్షంగా ఉన్నటీడీపీని అభినందించడం.. వచ్చే ఏడాది మంచి జరగాలని ఆశించడం వంటివి రాజకీయంగా తీవ్రప్రభావం చూపుతాయని అంటున్నారు.
This post was last modified on December 26, 2023 9:40 am
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…