కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న చాలా మంది నాయకులకు ఇప్పటికే మంత్రి పదవులు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..ఇప్పుడు మరో కీలక నిర్నయం తీసుకున్నారు. మంత్రుల్లో పది మందిని ఎంపిక చేసి.. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్‌లుగా నియమించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విడుదల చేశారు. కాగా, ఆయా జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత దూకుడుగా అందించడంతోపాటు.. పార్టీ పరంగానూ.. మంత్రులు చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపించేందుకు, వివాదాలు రాకుండా చూసుకునేందుకు కూడా వీరిపైనే బాధ్యత ఉండనుంది.
జిల్లాలు – మంత్రులు
హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్.
ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
వరంగల్- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.
నల్గొండ – తుమ్మల నాగేశ్వరరావు.
రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.
కరీంనగర్ – ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
మహబూబ్‌నగర్ – దామోదర రాజనర్సింహ.
మెదక్ – కొండా సురేఖ.
ఆదిలాబాద్ – సీతక్క.
నిజామాబాద్- జూపల్లి కృష్ణారావు.
This post was last modified on December 26, 2023 9:36 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…