ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రెడీ చేసుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి పేరుతో ప్రాంతీయ, కలిసి వచ్చే జాతీయ పార్టీలను ఏకం చేసి.. పొలిటికల్ ఫైట్‌కు రెడీ అవుతోంది. అయితే.. కాంగ్రెస్ వ్యూహాన్ని తలదన్నే లా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో మోడీ 2024 లక్ష్యాన్ని ప్రకటించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతాన్ని గత ఎన్నికల్లో కంటే 10 శాతం పెంచేందుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019లో 303 సీట్లు గెలిచామని, ఇప్పటినుంచి మిషన్ మోడ్‌లో పనిచేస్తే ఈసారి మరిన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో దూకుడుగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పార్టీ అధిష్ఠానానికి సూచించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ, సానుకూల సమాధానాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా పెద్దసం ఖ్యలో మహిళలు, యువత, రైతులు, పేదలను చేరుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఓట్ల పెంపుతో పాటు అయోధ్య రామాలయం నిర్మాణం, ఇక్కడ కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను కూడా ప్రజలకు వివరించి.. హిందూ ఓటర్లను మరింత మచ్చిక చేసుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాల న్నారు. కాగా, బీజేపీ దెబ్బకు ప్రతిపక్షాలు దిగ్భ్రాంతి చెందాలని పిలుపునివ్వడం గమనార్హం.
This post was last modified on December 24, 2023 3:03 pm
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్‌లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.…
మెగాభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకో 15 రోజులు మాత్రమే టైముంది. ప్రమోషన్లు రెగ్యులర్…