ఏపీలో రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు .. వివిధ కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శించిన టీడీపీ.. హఠాత్తుగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను లైన్‌లోకి తీసుకుంది. ఆయనతో చంద్రబాబు నేరుగా నాలుగు గంటల పాటు చర్చలు కూడా జరిపారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో పీకేను పూర్తిస్థాయిలో వాడతారో లేదో తెలియదు కానీ.. ఇప్పటికైతే సంకేతాలు ఇచ్చారు.
అయితే.. పీకే రాక.. టీడీపీకి ఎలా ఉన్నా.. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై పీకే ప్రభావం తీవ్రంగా ఉంటుందని మాత్రం పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన పార్టీలు చేతులు కలిపాయి. కలిసి పోటీ చేయాలని కూడా నిర్ణయించాయి. అయితే .. ఈ బంధాన్ని బీజేపీతో మరింత ద్రుఢ పరుచుకోవాలన్నది ఈ రెండు పార్టీల వ్యూహం. అందుకే.. తరచుగా పవన్ కళ్యాణ్.. ఎక్కడ మాట్లాడినా బీజేపీ గురించి వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు పవన్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు అనివార్యమని కూడా పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, మరోవైపు టీడీపీ కూడా.. బీజేపీ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే ఎదురు చూపులు లేకపోతే.. ఇప్పటికే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలతో ఈ రెండు పార్టీలు జతకట్టేవనే ప్రచారం కూడా ఉంది. కానీ, బీజేపీ కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా జరిగిన పరిణామంతో బీజేపీ.. టీడీపీ-జనసేన కూటమితో జతకట్టే పరిస్థితి ఉండదని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ- పీకేను అక్కున చేర్చుకుని.. ఆయన వ్యూహాలతో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బీజేపీకి, పీకేకి మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధాలు ఇప్పుడు లేకపోగా.. అవకాశం వస్తే.. అరెస్టు చేయాలన్న వ్యూహంతో బీజేపీ పెద్దలు.. పీకే టైం కోసం ఎదురు చూస్తున్నారన్నది జాతీయ వర్గాలు చెబుతున్న మాట.
అడుగడుగునా మోడీని విమర్శించడం.. దేశాన్ని హిందూత్వ గా మారుస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించడం.. మోడీ ఓటమిని లక్షించి .. గతంలో కాంగ్రెస్‌కు పనిచేయడం.. బిహార్‌లో నితీష్ కుమార్‌ను గెలిపించడం వంటివి బీజేపీకి మంటపుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే చాయలు అంటేనే బీజేపీ పెద్దలు మండి పడుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ పోయి పోయి పీకేతో చేతులు కలిపితే.. బీజేపీ రేపు ఈ కూటమికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 24, 2023 10:57 am
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…