Political News

కోట్లు ప‌లుకుతున్న ఎంపీ సీట్లు.. కాయ్ రాజా కాయ్‌.. !

ఏపీలో ఎంపీ సీట్లు హాట్ కేకుల్లా మారాయి. ఆ పార్టీ ఈపార్టీ అనే తేడా లేకుండా.. అన్ని పార్టీల‌దీ ఇదే ప‌రిస్థితిగా ఉంది. అధికార పార్టీలో అయితే.. ఏకంగా 70 నుంచి 120 కోట్ల వ‌ర‌కు కూడా ఎంపీ సీటుకు ధ‌ర ప‌లుకుతున్న‌ట్టు ప్ర‌చారంలో ఉంది. అదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో చేసిన ప్ర‌యోగాల‌కు కూడా.. ఈ ద‌ఫా పార్టీలు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న నాయ‌కులు, ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌గల నాయ‌కుల‌కు మాత్ర‌మే టికెట్ ఇవ్వాల‌ని దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చాయి.

అయితే.. ఇక్క‌డ ఒక పార్టీ వ్యూహం పై మ‌రోపార్టీ ఆధార‌ప‌డి ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్య‌ర్థి పార్టీ వేసే అడుగుల‌ను చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్న పార్టీలు.. ఆ పార్టీ అనుస‌రిస్తున్న‌ వ్యూహాల‌ను దెబ్బ‌కొట్టేలా పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎంపీ సీట్ల‌కు ఎన‌లేని ప్రాధాన్యం పెరిగిపోయింది. ఒక ఎంపీ స్థానంలో క‌నీసం.. ఆరు నుంచి 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిని త‌మ ఖాతాలో వేసుకోవాలంటే.. ఎంపీ షేర్ కీల‌కంగా ఉంది.

అదే స‌మ‌యంలో ఎంపీ బ‌ల‌మైన నాయ‌కుడు అయితేనే ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని కూడా పార్టీలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన ఎంపీ అభ్య‌ర్థుల కోసం వెతుకున్న‌ట్టు పార్టీల్లో చ‌ర్చ సాగుతోంది. ఉమ్మ‌డి ప్రకాశం జిల్లాలో ఒక ఎంపీ స్థానానికి ఏకంగా 150 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడ‌తానంటూ.. ఓ నాయ‌కుడు ప్ర‌తిప‌క్ష పార్టీకి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. దీంతో ఇంతక‌న్నా ఎక్కువ ఖ‌ర్చు పెట్టే నాయ‌కుడి కోసం అధికార పార్టీ బూత‌ద్దం ప‌ట్టుకుని వెతుకుతోంద‌ని తెలిసింది.

అదేవిధంగా విశాఖ, విజ‌య‌వాడ, రాజ‌మండ్రి ఎంపీ సీట్లు మ‌రింత ఎక్కువ‌గానే ధ‌ర ప‌లుకుతున్నాయ‌ని స‌మాచారం. ఇక్క‌డ పోటీ అంటే.. సామాన్యం కాద‌నే టాక్ కూడా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా ఇప్పుడు ఏపీలో రాజ‌కీయం మారుతుండ‌డంతోపాటు.. పోటీ  కూడా తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో మ‌నీ విష‌యంలో ఏ పార్టీ కూడా రాజీ ప‌డే ప‌రిస్థితి లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ఆయా పార్టీల నాయ‌కులు. దీంతో ఆశ‌లు పెట్టుకున్న వారు కూడా.. ప‌క్క‌కు త‌ప్పుకుంటున్న ప‌రిస్థితి ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 27, 2023 1:16 pm

Share

Recent Posts

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

41 minutes ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

3 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

3 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

4 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

4 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

5 hours ago