వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యూచరేంటి? ఆయనకు వైసీపీలో ఉన్న ప్రాధాన్యమేంటి? అంటే.. పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మరీ వచ్చి వైసీపీకి మద్దతు పలికిన బాలినేనికి.. జగన్ ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. 2014లోను, 2019లో నూ ఆయనకు ఒంగోలు టికెట్ ఇచ్చారు. 2014లో ఓడిపోయినా.. పార్టీలో ఆయన మాటకు విలువనిచ్చారు.
ముఖ్యంగా కీలక నాయకుడు.. వైవీ సుబ్బారెడ్డితో నిత్యం కయ్యాలు పెట్టుకున్నా.. పార్టీ అధినేత జగన్ సహించారు. సర్దుకుపోయారు. ఇక, 2019లో విజయం దక్కించుకున్న తర్వాత.. తన మంత్రి వర్గంలోనూ తీసుకున్నారు. అయితే, రెండోసారి షఫిలింగ్‌లో మాత్రం ఆయనను సామాజిక వర్గాల ప్రాతిపదికన పక్కన పెట్టారు. దీనిని అర్ధం చేసుకోలేక పోయారో.. లేక.. తనే మోనార్క్ అనుకున్నారో తెలియదు కానీ బాలినేని అప్పటి నుంచి తిరుగుబావుటా ఎగరేయడం ప్రారంభించారు.
జిల్లాల ఇంచార్జ్ పదవి ఇస్తే.. దానికి రాజీనామా చేశారు. పోలీసు అధికారుల ట్రాన్సఫర్ విషయంలోనూ లొల్లి పెట్టారు. వైవీపై అదే రగడ కొనసాగిస్తున్నారు. అధినేత జగన్ అంటే.. తృణ ప్రాయంగా తీసేస్తూ.. ఆయనపైనే మరకలు అంటించేలా.. మంత్రిగా ఉన్నప్పుడు లంచాలు తీసుకున్నానని వ్యాఖ్యానించారు. జగన్‌కు అభిమానం లేదని ఈసడించారు. మొత్తంగా చూస్తే.. బాలినేని వ్యవహారం తనుకు తానే చేసుకు న్న, తీసుకున్న అఘాతంలో పడిపోయింది.
పోనీ.. వైసీపీని కాదని వేరే పార్టీలోకి వెళ్లే సాహసం చేయలేరు. వెళ్లినా.. ఇక్కడున్న గౌరవం కానీ, ఇప్పుడు న్న మర్యాదగానీ లభించడం కూడా కష్టమేనన్నదిఆయనకు కూడా తెలుసు. అయినా కూడా ధిక్కార బాటలోనే ముందుకు సాగారు. ఫలితంగా ఇప్పుడు దాదాపు తాడేపల్లి ప్యాలస్ గేట్లు పూర్తిగా మూసుకుపో యాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
బాలినేనిని నేను పిలవను. తనంతట తానే వస్తే.. అప్పుడు పరిశీలిస్తా
అని జగన్ అనే వరకు వచ్చిందంటే పరిస్థితిని ఎంతగా బాలినేని దిగజార్చుకున్నారో అర్థమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంగా వైసీపీలో ఉండడమా.. లేక వెళ్లడమా.. అనేది ఇప్పుడు బాలినేని ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుందని చెబుతున్నారు. మరిఆయన ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 24, 2023 10:00 am
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…