వచ్చే ఎన్నికల్లో పోటీ ఎలా ఉన్నా.. పది స్థానాలైనా పాతికైనా.. వందైనా.. అసలు పోటీలో ఉన్న నాయకులకు కీలక వనరు సొమ్ములే! ప్రజలకు పంచాల్సిన అవసరం లేకపోయినా.. పంచకపోయినా.. కనీసం నాయకులకు చేతి ఖర్చు.. ప్రచార ఖర్చు.. వంటివి కీలకం కదా! ఇవేవీ ఉచితంగా ఎవరూ చేయరు. సో.. ఆ ఖర్చులకైనా నాయకులకు డబ్బులు కావాలంటే.. ఇబ్బందులు తప్పేలా లేవనేది జనసేనలో వినిపిస్తున్న మాట.
“వచ్చే ఎన్నికలు భారీ ఖర్చుతో కూడుకున్నవనే టాక్ ఉంది. తెలంగాణ ఎన్నికలు చూశాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 50 లక్షలపైనే ఖర్చయింది. మా పరిస్థితి చూస్తే.. ఇబ్బంది తప్పేలా లేదు” అని జనసేనలో నాయకులు చర్చించుకుంటున్నారు. దీనికి కారణం.. చెప్పే ముందు.. మరో కీలక విషయం ఉంది. సాధారణంగా గెలిచే నాయకుడు ఎవరనేది అంచనాకు వస్తే.. సదరు నియోజకవర్గంలోని పారిశ్రామిక వేత్తలు.. లేదా వ్యాపారులు అడగకుండానే పని చేసి పెడతారు.
ఇది తెలంగాణలో బాగానే వర్కవుట్ అయింది. దీంతో అసలు గెలుపుపై అంచనాలు లేని వారు కూడా విజయం సాధించారు. ఈ తరహా పరిస్థితిఇప్పుడు ఏపీలో జనసేనకు కనిపిస్తుందా? అనేది ప్రశ్న. దీనిపైనే జనసేన నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. అసలు గెలుస్తారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. గెలుస్తున్నామనే ధీమాను పారిశ్రామిక, వ్యాపార వర్గాల్లో అయిన కల్పించగలిగితే చేతులు తడుస్తాయనేది వారి మాట. కానీ, ప్రస్తుతం జనసేనలోనే పెద్ద కలకలం రేగింది.
పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా.. తర్వాత పరిణామాలపైనే అందరూ దృష్టి పెట్టారు. దీంతో పారిశ్రామిక, వ్యాపార వర్గాలు.. ఈ పార్టీని ఎంత వరకు ఆదరిస్తాయనేది ప్రశ్నగామారింది. మరోవైపు.. పార్టీలోనూ భారీగా ఫండ్స్ లేవు. ఇండస్ట్రీలో పవన్ అంటే అభిమానించే వారు కూడా.. పార్టీకి ఫండ్స్ ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. దీంతో అభ్యర్థులు తమ సొంత నిధులనే వెచ్చించాల్సి ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. తెలంగాణను మించి ఖర్చు అవుతుందనే అంచనాలు వున్న ఏపీ ఎన్నికల్లో అంత ఖర్చు భరించే నాయకులు ఉన్నారా? అనేది జనసేన టాక్. చూడాలి ఏం చేస్తారో.
This post was last modified on December 24, 2023 9:46 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…