తాజాగా విడుదలైన ప్రభాస్ మూవీ సలార్ తొలి రోజు హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత..అనేక పరాజయాలు చవి చూసిన ప్రభాస్‌కు ఒకింత ఈ సినిమా రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో డైలాగులు కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఇక, ఈ సినిమాను రాజకీయ నాయకులు కూడా వీక్షించారు. అయితే.. వీక్షించి సరిపెడితే ఏముంటుందని అనుకున్నారో..ఏమో టీడీపీ కురువృద్ధుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. సలార్‌కు సీఎం జగన్‌కు ముడి పెట్టి పొలిటికల్ సటైర్లు కుమ్మేశారు.
వయసులో పెద్దే అయినా.. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పొలిటికల్‌గాను, ఇతర విషయాల్లోనూ చాలా చురుగ్గా ఉంటారనే పేరుంది. మరీ ముఖ్యంగా ఇటవల కాలంలో సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. మాటకు మాట.. అన్నట్టుగా కామెంట్లు కూడా కుమ్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బుచ్చయ్య చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై బుచ్చయ్య చౌదరి ఓ ట్వీట్ చేశారు. అదికూడా శుక్రవారం విడుదలైన ప్రభాస్ సలార్ మూవీని లింకు పెట్టడంతో దీనికి మరింత ఇంట్రస్ట్ పెరిగింది.
“ప్రభాస్‌ను కరెక్టుగా వాడుకుంది దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్‌ను కరెక్టుగా వాడుకుంది డైరెక్టర్ రాజమౌళి, వినాయక్ మాత్రమే. మహేష్‌బాబును కరెక్టుగా వాడుకుంది పూరీ జగన్నాథ్ మాత్రమే. అల్లు అర్జున్‌ను కరెక్టుగా వాడుకుంది సుకుమార్ మాత్రమే. అలాగే బాబాయ్, చెల్లి, తల్లిని కరెక్టుగా వాడుకుంది జగన్ మాత్రమే” అని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This post was last modified on December 23, 2023 10:11 pm
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…