Political News

రేవంత్ కొత్త నిర్ణయం

ప్రజావాణిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. ప్రజల సమస్యలు విని వీలైనంత తొందరగా తీర్చే ఉద్దేశ్యంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేవంత్ ను కలిసి సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతాయని రాష్ట్రంలోని చాలామంది జనాలు ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రజాదర్బార్(ప్రజావాణి)లో రోజుకు 4 వేలమంది బాధితులు వస్తున్నట్లు లెక్క తేలింది.

అందుకనే ఇక నుండి అంటే కొత్త సంవత్సరం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్ లోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలోను జరపాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ప్రతి ఎంఎల్ఏ వారంలో ఒకరోజు ప్రత్యేకించి ప్రజావాణి కార్యక్రమంలోనే ఉండి బాధితులతో మాట్లాడాలని రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి లాంటి కార్యక్రమాలతోనే ప్రజలకు ప్రభుత్వం దగ్గరవుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రజలిచ్చే సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపేందుకు, ఫాలో అప్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలోను ఒక నోడల్ అధికారిని నియమించే ఆలోచనలో ఉన్నారు రేవంత్.

ప్రతి నియోజకవర్గంలోను ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే జనాలంతా వినతులు తీసుకుని హైదరాబాద్ కు వచ్చే బాధలు తప్పుతాయని రేవంత్ భావించారు. అందుకనే నియోజకవర్గాల స్ధాయిలో కూడా ప్రజావాణినిని మొదలుపెడుతున్నది. ఇపుడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్ కు ప్రజావాణి కార్యక్రమం అదనంగా పనిచేస్తుంది. పదేళ్ళ పాలనలో కేసీయార్ ఏనాడు ఈ విధంగా బాధితులను కలిసిందిలేదు. అసలు సచివాలయంకు కేసీయార్ రావటమే చాలా ఎక్కువన్నట్లుగా ఉండేది.

వారాల తరబడి ఫాం హౌస్లో కూర్చునే వారు. మంత్రులు, ఉన్నతాధికారులు కలవాలని అనుకున్నా కేసీయార్ కలిసే వారు కాదు. అలాంటిది ఇపుడు రేవంత్ ప్రతిరోజు జనాలను కలుస్తు, ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో సమీక్షలు నిర్వహిస్తుంటే అందరు హ్యాపీగా ఫీలవుతున్నారు. కేసీయార్ పదేళ్ళ పాలనతో ఇపుడు రేవంత్ పాలనను పోల్చి చూసుకోవటం ఎక్కువైపోతోంది. అందుకనే ప్రజావాణిలోనే కాకుండా రేవంత్ ను కలవటానికి జనాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు సచివాలయంకు రావటం ఎక్కువైపోతోంది. మరిలా ఎంతకాలం రేవంత్ జనాలను కలుస్తారో చూడాలి.

This post was last modified on December 23, 2023 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పూరి సినిమా.. అతను గానీ ఒప్పుకుంటే

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు…

25 minutes ago

తీవ్రవాదం – టాలీవుడ్ సినిమాల ఉక్కుపాదం

దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ దుర్ఘటన పట్ల చిన్నా పెద్దా ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ నుంచి…

26 minutes ago

గాడ్జిల్లా చూసాం….ఈ నాగ్జిల్లా ఏంటయ్యా

ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజి దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. నిన్న కార్తీక్…

1 hour ago

ఫౌజీ హీరోయిన్ మీద వివాదమెందుకు

యావత్ దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ సంఘటన తర్వాత ఊహించని కోణాల్లో వివాదాలు తలెత్తున్నాయి. తాజాగా ప్రభాస్ ఫౌజీ ద్వారా హీరోయిన్…

1 hour ago

వీరయ్య చౌదరి హత్య…రంగంలోకి 12 పోలీసు బృందాలు!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…

2 hours ago

పీఎస్ఆర్ ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్!

బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న…

2 hours ago