కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని.. కాపుల అభ్యున్నతి కోసం ప్రయత్నాలు చేస్తున్నానని ప్రకటిస్తున్న మాజీ ఎంపీ హరిరామజోగయ్య.. తాజాగా సంధించిన లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. ముఖ్యమంత్రి సీటు విషయం చర్చనీయాంశం అయింది. అయితే, తనకు పదవులపై కాంక్ష లేదని.. జనసేనాని పదే పదే చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలను కార్నర్ చేస్తూ.. తాజాగా జోగయ్య పవన్‌కు బహిరంగ లేఖ రాశారు. కాపులకు ఏం సమాధానం చెబుతారని, మీపైనే ఆశలు పెట్టుకుని, కలలు కన్న వారికి ఎలాంటి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఇది ఒక రకంగా.. జనసేనాని గాలి తీసేసే ప్రయత్నమేనన్నది రాజకీయ వర్గాల టాక్. ఆయనకు ఏదైనా చెప్పాలని ఉంటే.. నేరుగా పవన్‌తోనే చర్చించి ఇది తప్పు.. లేదా ఇది ఒప్పు అని చెప్పుకొనే అవకాశం ఉందని అంటున్నారు.
అలా కాకుండా.. బహిరంగ వేదికలపై జనసేన ను ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. కాపులపక్షాన ఉంటున్నామని, కాపుల కోసం నిలబడుతున్నా మని చెప్పే జోగయ్య.. పవన్‌ను ఇలా యాగీ చేయడం.. ఆయనను కార్నర్ చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఉంటే.. సరైన వేదిక ద్వారా అభిప్రాయం వెల్లడించవచ్చని అంటున్నారు. ఇక, పవన్ వ్యవహారం చూసినా.. ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉన్నారని చెబుతున్నారు.
కాపులకు మేలు చేయాలంటే.. కేవలం ముఖ్యమంత్రి పీఠమే పరమావధి కాదన్న విషయాన్ని పవన్ పదే పదే చెబుతున్నా.. జోగయ్య వంటివారికి అర్ధం కావడం లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏదైనా చెప్పాలని ఉంటే.. నేరుగా పవన్‌ను కలిసి.. ఆయనతోనే అభిప్రాయం పంచుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఇలా బహిరంగ లేఖల ద్వారా వ్యాఖ్యలు చేసి.. అనవసరంగా పార్టీని ఇరుకున పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on December 22, 2023 7:27 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…