ఎన్నికల సమయంలో నేతలు పార్టీలమధ్య దూకుడ్లు మామూలే. ముఖ్యంగా టికెట్ల విషయంలోనే నేతలు పార్టీలు మారుతుంటారు. ఒకపార్టీలో ఉన్నవారు తమకు టికెట్లు రావని కన్ఫర్మ్ అయితే వెంటనే పార్టీమారిపోవటానికి సిద్ధపడతారు. ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసినా వైసీపీ నుండి ఇప్పటివరకు పార్టీ మారుతున్నట్లు ప్రకటన లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఎవరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీనికి కారణం ఏమిటి ?
ఏమిటంటే పార్టీమారినా పోటీచేసేందుకు వాళ్ళకు అవకాశాలు తక్కువన్న ధీమాతో జగన్ ఉన్నట్లు అనుమానంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సుమారు 70 నియోజకవర్గాల్లో భారీ మార్పులుంటాయని అంచనా. ఇందులో తక్కువలో తక్కువ 40 మందికి అసలు టికెట్లే రావని ప్రచారం జరుగుతోంది. మరో 30 మందికి నియోజకవర్గాలు మార్చటం, లేదా ఎంపీలుగా పోటీచేయించటం తప్పదన్న ప్రచారం అందరికీ తెలిసిందే. కొందరు మంత్రులు, ఎంఎల్ఏలను జగన్ ఎంపీలుగా పోటీచేయించాలని అనుకుంటున్నారట. అలాగే మరికొందరు ఎంపీలకు ఎంఎల్ఏలుగా పోటీచేసే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.
మార్పులు ఎలాంటివి అయినా ఇంతపెద్ద స్ధాయిలో మార్పులు చేయటం అన్నది చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకింతటి పెద్ద సహసం చేయటానికి జగన్ రెడీ అయిపోయారు ? అసలు జగన్ ధైర్యం ఏమిటనే చర్చ పెరిగిపోతోంది. దీనికి సమాధానం ఏమిటంటే ఇప్పటికిప్పుడు పార్టీలో నుండి ఇతర పార్టీల్లోకి జంప్ చేసినా అక్కడ టికెట్ గ్యారెంటీ లేకపోవటమే. టికెట్ దక్కదని తెలిసిన తర్వాత జగన్ మీద కోపంతో ఎవరైనా సిట్టింగ్ ఎంఎల్ఏ ఏమిచేస్తారు ?
మామూలుగా అయితే టీడీపీ లేదా జనసేనలోకి వెళ్ళాలి. ఇపుడు కూడా అలా వెళితే ఏమవుతుంది ? ఆ పార్టీల తరపున పోటీచేసే అవకాశం దక్కుతుందా ? పార్టీలోకి తీసుకున్నా టికెట్ గ్యారెంటీలేదన్న విషయం జగన్ కు బాగా తెలుసు. టిక్కెట్ దక్కనపుడు ఏమిచేయాలి ? ఎంఎల్ఏ అభ్యర్ధి గెలుపుకు సహకరించాలి. పోటీచేసే అవకాశం దక్కనపుడు ఏ పార్టీలో ఉంటే ఏమిటి ? అనే ఆలోచనలో సిట్టింగ్ ఎంఎల్ఏలున్నట్లు జగన్ పసిగట్టారు. అందుకనే ఇంత ధైర్యంగా మార్పులకు రెడీ అయినట్లున్నారు.
This post was last modified on December 22, 2023 9:32 pm
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…