ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడు పెంచుతోంది. ముందుగా సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రు. 10 లక్షలకు పెంచటమే కాకుండా మహిళలకు ఉచితబస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. మూడో హామీ రు. 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీపై పెద్దస్ధాయిలో కసరత్తు జరగుతోంది. ఇవన్నీ సంక్షేమపథకాల కిందకు వస్తుంది. అందుకనే తొందరలోనే ఉద్యోగాల భర్తీకి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం. వీలైనంత తొందరలో అంటే ఒకటి, రెండు నెలల్లోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందట.
ఉద్యోగాల భర్తీ అంటే ముందుగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ రెడీ అవుతోందని సమాచారం. గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన జరగాలి. పబ్లిక్ సర్వీస్ కమీషన్ పద్దతిలో గ్రూప్స్ కు నోటిఫికేషన్ జారీచేసి ఉద్యోగాల భర్తీ చేయాలన్నది ప్రభుత్వఆలోచన. అందుకనే ఈలోగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తే బాగుంటుందని రేవంత్ అనుకున్నారట.
మొత్తంమీద భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులు 10 వేల దాకా ఉన్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటే ఇప్పటికే పెండింగులో ఉన్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియ అడ్డుగా ఉంటుంది. అందుకనే ముందు ప్రమోషన్లతో పాటు బదిలీలను పూర్తిచేసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. డీఎస్సీ నిర్వహించటమా లేకపోతే టెట్ (టీచర్ ఎలిజిబులిటి టెస్ట్) ద్వారా భర్తీ చేయాలా అన్నది సమస్యగా మారింది.
భర్తీ చేయాల్సిన పదివేల పోస్టులు, పెండింగులో ఉన్న 2 వేల స్పెషల్ టీచర్ పోస్టులు కలిపి 12 వేల టీచర్ పోస్టుల భర్తీకి రెడీగా ఉంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏడాదికి రెండుసార్లు డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. టెట్ ద్వారా భర్తీ చేద్దామని అనుకున్న 5089 పోస్టుల నోటిఫికేషన్ కు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సో వీలైనంత తొందరలో చిన్న చిన్న వివాదాలను పరిష్కరించి ఒకేసారి 12 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on December 22, 2023 11:57 am
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…