మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎట్టి పరిస్ధితుల్లోను మళ్ళీ పదవుల్లో నియమించకూడదని తెలంగాణా పీసీసీతో పాటు ఐఏసీసీ కూడా నిర్ణయించినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో వివిధ కారణాలతో కొందరు సీనియర్లకు పార్టీ టికెట్లు ఇవ్వలేదు. అప్పట్లో టికెట్లు ఇవ్వలేకపోతున్నా కారణంగా అనేక హామీలిచ్చింది. అలాంటి హామీల్లో ఎంఎల్సీ పదవులు, పార్లమెంటు టికెట్లు, కార్పొరేషన్ పదవుల్లాంటివి ఉన్నాయి. కాబట్టి ముందుగా పోటీచేయని సీనియర్లకు, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికి టాప్ ప్రయారిటి ఇవ్వాలన్న పీసీసీ ప్రతిపాదననే ఐఏసీసీ అగ్రనేతలు కూడా సమర్ధించారట.
మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన వారిలో జగ్గారెడ్డి, షబ్బీర్ ఆలీ, మధు యాష్కి గౌడ్, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళున్నారు. అయితే జీవన్ ఇప్పటికే ఎంఎల్సీ కాబట్టి ఓడినా నష్టం జరగలేదు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ అధికారంలోకి రావటంతో ఓడిపోయిన వాళ్ళందరిలో ఆశలు మొదలయ్యాయి. తొందరలోనే భర్తీ చేయబోతున్న ఎంఎల్సీ పదవులు, కార్పొరేషన్ పదువుల్లో తమను నియమించాలని రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇక్కడే పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఎన్నికల్లో టికెట్లు వాళ్ళకే కావాలి, ఓడిపోతే తర్వాత భర్తీచేయబోయే నామినేటెడ్ పోస్టులూ వాళ్ళకే కావాలా అంటు కొందరు సీనియర్లపై మిగిలిన నేతలు గుర్రుమంటున్నారు. తొందరలోనే ఆరు ఎంఎల్సీ పదవులను భర్తీ చేయాల్సుంటుంది. ఇందులో గవర్నర్ కోటాలో రెండు, ఎంఎల్ఏల కోటాలో రెండు, లోకల్ బాడీ, గ్రాడ్యుయేట్ల కోటాలో చెరో స్ధానం భర్తీ అవుతాయి. ఈ ఆరింటినీ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉండటంతో మొన్నటి ఎన్నికల్లో ఓడిన వారు, సీనియర్లు పోటీలు పడుతున్నారు.
పీసీసీ. ఏఐసీసీ తాజా నిర్ణయంతో చాలామంది సీనియర్లకు మండిపోవటం ఖాయం. కాకపోతే పార్టీ భవిష్యత్తును, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని పార్టీ భావిస్తోంది. అందుకనే పదవుల భర్తీలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏదేమైనా పదవుల భర్తీ అన్నది రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉండబోతోందని పార్టీవర్గాల సమాచారం. లేకపోతే అప్పటికి కంపు అయిపోవటం ఖాయం.
This post was last modified on December 18, 2023 2:29 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…