మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో లోపాలకు సంబంధించి ఎల్ అండ్ సంస్ధ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోయాయి. దాంతో బ్యారేజీకి కూడా కొంతమేర డ్యామేజి జరిగింది. విషయం తెలియగానే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. ఆరోపణలనుండి తప్పించుకునేందుకు కేటీయార్, హరీష్ రావు తదితరులు మాట్లాడుతు జరిగిన డ్యామేజిని నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టీ నే భరిస్తుందన్నారు. ఇదే విషయాన్ని సంస్థ జనరల్ మేనేజర్ కూడా ప్రకటించారు.
అయితే ఎన్నికలైపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా ఎల్ అండ్ టీ నుండి ప్రాజెక్టు సూపరెండెంట్ ఇంజనీర్(ఎస్ఇ)కి ఒక లేఖ అందింది. అందులో పిల్లర్లు, బ్యారేజికి జరిగిన డ్యామేజికి తమకు సంబంధంలేదని సంస్ధ చెప్పింది. మరమ్మత్తులకు అయ్యే ఖర్చులు సుమారు రు. 500 కోట్లను ప్రభుత్వమే భరించాలని కూడా సంస్ధ తన లేఖలో చెప్పింది. ఇక్కడే బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడింది.
నిజానికి పిల్లర్లు కుగినపుడు, బ్యారేజికి డ్యామేజి జరిగినపుడు సంస్ధ నిర్వహణ పరిధిలోనే ఉందని అప్పట్లో కేటీయార్, హరీష్ రావులు పదేపదే చెప్పారు. కాబట్టి మరమ్మత్తులకు అయ్యే ఖర్చు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. ఇదే విషయాన్ని సంస్ధ మేనేజ్మెంట్ కూడా అంగీకరించింది. అలాంటిది ప్రభుత్వం మారిపోగానే ఎల్ అండ్ టి ఎందుకని అడ్డం తిరిగిందో అర్ధంకావటంలేదు. ఎల్ అండ్ టి సంస్ధ వైఖరి ఎలాగున్నా సమస్య ఇపుడు బీఆర్ఎస్ కు చుట్టుకునేట్లే ఉంది.
అప్పట్లో ఎన్నికల్లో ఓట్లకోసమే ఖర్చులు, రిపేర్ల విషయంలో కేటీయార్, హరీష్ రావులు ఎల్ అండ్ టి సంస్ధతో తప్పుడు ప్రకటనలు ఇప్పించారని కాంగ్రెస్ మొదలుపెట్టేసింది. లేకపోతే అప్పట్లో రిపేర్లను తామే చేస్తామని చెప్పిన సంస్ధ ఇపుడు ఎందుకు అడ్డం తిరిగిందని మంత్రులు నిలదీస్తున్నారు. అప్పట్లే కేటీయార్, హరీష్ చెప్పినట్లే నడుచుకున్న సంస్ధ ఇపుడు కూడా అలాగే నడుచుకుంటోందని ఆరోపిస్తున్నారు. అందుకనే మేడిగడ్డ బ్యారేజి అంశం రేపటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బాగా డ్యామేజి తెచ్చేట్లే ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 18, 2023 10:32 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…