విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో నిర్వహిస్తోన్న కోవిడ్ సెంటర్ లో ఈ ఏడాది ఆగస్టు 9న భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోగా…మరో 20 మంది గాయపడ్డారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఈ కేసులో తన అరెస్ట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ రమేష్ హాస్పటల్స్ యజమాని డాక్టర్ రమేష్ బాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…రమేష్ పై తదుపరి చర్యలు తీసుకోవంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై గత మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలను ఎందుకు బాధ్యులను చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతినిచ్చిన అధికారులు కూడా ఈ ఘటనకు బాధ్యులేనని హైకోర్టు అభిప్రాయడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బందిని బాధ్యులుగా చూపించడం ఏమిటనని హైకోర్టు ప్రశ్నించింది. ఏళ్ల తరబడి ఆ హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని..అక్కడ కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వారం రోజుల గడువు కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
This post was last modified on September 2, 2020 11:57 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…