రాష్ట్రంలో అధికార వైసీపీలో చెలరేగిన రాజీనామాలు.. పార్టీ ఇంచార్జ్‌ల మార్పు వంటివి రాజకీయంగానే కాకుండా.. ప్రజల మధ్య కూడా తీవ్రమైన చర్చగానే మారాయి. స్థానికంగా నేతలు కొంత మేరకు ఆందోళన కూడా చేశారు. అయితే.. దీనిపై సాగుతున్న చర్చలో భాగంగా..వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కిం చుకుంటుంది? ఏ పార్టీకి ఓటేయాలనే చర్చ కూడా సాగుతోంది.
ఏ ఇద్దరు బడ్డీ కొట్టు దగ్గర చేరినా.. వచ్చే ఎన్నికల్లో ఓటెవరికి భాయ్! అనే కామెంటే వినిపిస్తోంది. అయితే.. ఇక్కడ గత 2019 ఎన్నికల వేళ జరిగిన పరిణామాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. జనాలకు అమలు చేస్తున్న వివిధ పథకాలు.. సంక్షేమ పాలన నేపథ్యంలో వైసీపీకి నేరుగా ఓటేసేందుకు జనాలు రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ పథకాలు.. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం చేసింది కదా! అనే చర్చకూడా వస్తోంది.
నిజమే.. గత టీడీపీ ప్రభుత్వం ఏకంగా ఎన్నికలకు ముందు.. మధ్యలోనూ పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కేంద్రంగా చేసుకుని రూ.10 వేలను(4+4+2 వేల చొప్పున) పంచింది. అయినా.. మహిళలు టీడీపీతో లేరు. వైసీపీకి ఓటెత్తారు. ఈ క్రమంలో ఇప్పుడు కూడా.. ఇలానే వైసీపీ ఇస్తున్న సొమ్ములు తీసుకున్నా.. ఓటేస్తారో లేదో అనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ విషయంపై వైసీపీ నిర్దిష్ట అభిప్రాయంతో ఉంది.
ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా.. ఎక్కడా క్రమం తప్పకుండా వైసీపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. సో.. పోలింగ్ బూత్‌కు వెళ్లిన మహిళలకు.. ఖచ్చితంగా బటన్ నొక్కే ముందు.. తాను తీసుకున్న సొమ్ము.. తన కుటుంబానికి జరిగిన లబ్ది వంటివి గుర్తుకురావడం ఖాయమని, ఆ విధంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందుకున్నవారిని మోటివేట్ చేయాలని పార్టీ అధిష్టానం సూచనలు చేసిందని నాయకులు చెబుతున్నారు.
This post was last modified on December 16, 2023 3:07 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…