ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బీజేపీ వచ్చే పార్లమెంటుఎన్నికల్లో మాత్రం కటీఫ్ చెప్పింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళ్లేది లేదని బీజేపీ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి తాజాగా వెల్లడించారు. దీంతో పవన్‌ను అసెంబ్లీ ఎన్నికల వరకు వాడుకుని వదిలేశారా? లేక.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారనే భావనతో లాభం లేదని అనుకున్నారా? అనే చర్చ రాజకీయంగా ప్రధాన్యం సంతరించుకుంది.
కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ నాయకులు ఒంటరిగానే సిద్ధం కావాలని కిషన్ రెడ్డి తాజాగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరో పది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని చెప్పారు. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలు, లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జిలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర, విశ్వకర్మ యోజన పథకాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.
“సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ ఎస్‌తో సమాన పోరాటాలు చేయాల్సి ఉంటుంది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి. తెలంగాణలో రాజకీయంగా బీజేపీ నేతలకు, పార్టీకి కూడా మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం ఇదే తరహాలో ఫలితాలిస్తున్నాయి. తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలు పెట్టాలి. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడబోతోంది” అని కిషన్ రెడ్డి చెప్పారు.
అయితే.. ఈ సందర్భంగా ఎవరితోనూ పొత్తులు ఉండవని చెప్పడం ద్వారా .. జనసేనతో ఉన్న బంధాన్ని బీజేపీ తెంచుకుందనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకే పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు వదిలేయడం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? లేక.. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on December 16, 2023 8:26 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి…
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…
మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ 'ఆఫీసర్ ఆన్…
సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.…
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వరుస పెట్టి విమర్శలు…
మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల జరిగిన…