Political News

వైసీపీ మునుగుతున్న నావ‌.. జాగ్ర‌త్త ప‌డండి: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న పిలుపునిచ్చారు. అధికార పార్టీ వైసీపీని మునుగుతున్న నావ‌తో పోల్చారు. ఆ పార్టీలో ఉన్న నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే జాగ్రత్త ప‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. “చేతులు కాలాక‌.. నిండా మునిగాక బాధ‌ప‌డి ప్ర‌యోజ‌నం లేదు. ముందుగానే మేల్కొనండి. మీ దారి మీరు చూసుకోండి. ధైర్యం చేయండి” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నావకు చిల్లు పడింద‌న్న ఆయ‌న దాని నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నాయ‌కులు కూడా బయటపడే పరిస్థితి లేదన్నారు. దూకి పారిపోతేనే ప్రాణాలు కాపాడుకుంటారని, లేకపోతే కొట్టుకుపోతారని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు.

ఇప్పటికే వైసీపీలో రాజ‌కీయ ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు త‌మ అనుచ‌రుల‌తో టీడీపీలో చేరిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీని మునిగిపోతున్న నావ‌గా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. “రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో సైకిల్‌ స్పీడ్‌ మరింత పెరుగుతుంది. ఫ్యాన్‌ తిరగడం ఆగిపోతుంది. వారితో విభేదించారనే నెపంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో టార్చర్‌ చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం?” అని ప్ర‌శ్నించారు.

జగన్‌ అన్ని సంప్రదాయాలను సర్వనాశనం చేశారని చంద్ర‌బాబు ఫైర‌య్యారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడారా? క‌నీసం మీడియాతో అయినా.. మాట్లాడారా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారంటూ.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై నిప్పులు చెరిగారు. “ఎన్నికలకు ముందు ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు. జగన్‌ ఒక అపరిచితుడు. చెప్పింది ఒక్కటీ చేయడు. తల్లికి, చెల్లికి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడు” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ఇప్పుడు 11 మంది ఇన్‌ఛార్జిలను మార్చారని, రాబోయే కొద్ది వారాల్లోనే 151 మందిని మార్చినా రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు.

వెనుకబడిన వర్గాలను బలపరిస్తేనే సామాజిక న్యాయం ద‌క్కుతుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జ‌గ‌న్‌.. కేంద్రం మెడలు వంచలేదు కానీ.. త‌న‌ మెడలు ఒంచుకున్నార‌ని వ్యాఖ్యానించారు. పోలవరం పనులు త‌న హ‌యాంలోనే 72శాతం పూర్తయ్యాయని చంద్ర‌బాబు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్లమ‌ని చెప్పారు. ఇప్పుడు.. అస‌లు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుమ‌రుగు అవుతుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

This post was last modified on December 15, 2023 11:00 pm

Share
Show comments

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

1 hour ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

2 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

3 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

3 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

3 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

3 hours ago