తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుంది. అయితే, మహిళలంతా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉండటంతో మెట్రో రైలుతోపాటు ఆటోల వంటి ప్రైవేటు వాహనాలకు గిరాకీ తగ్గింది. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి పథకంపై భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మహాలక్ష్మి పథకం రావడానికి ముందు 70 శాతం మంది మహిళలు ఆటో ఎక్కే వారిని, ఆనాడు 1000 రూపాయలు ఉండే రోజు వారి సంపాదన ఇప్పుడు 300 కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంతో తమ పొట్ట కొట్టారని, కాబట్టి ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఆటోలను పెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే బస్సుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గత ప్రభుత్వం రవాణా చట్టానికి తూట్లు పొడుస్తూ ఓలా, ఉబర్ క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని, ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో తమ జీవనోపాధికి గండి కొట్టిందని వారు వాపోతున్నారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆటో సంఘాలతో చర్చలు జరిపి న్యాయం చేయకుంటే ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని, ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 8 లక్షల ఆటో డ్రైవర్ల భవిష్యత్తు అంధకారంలో ఉందని, ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, మహాలక్ష్మి పథకంతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కు వచ్చి పడినట్లయింది.
This post was last modified on December 15, 2023 10:48 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…