తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. పారిశ్రామిక దిగ్గజాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు, బులియన్ మార్కెట్ నుంచి ఇతర వ్యాపార వర్గాల వరకు కూడా.. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చేస్తారని భావించినట్టు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. దీంతో వారంతా.. కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరించారని తెలిపింది.
కేవలం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య కాలంలో.. అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఒక నెల ముందు వరకు కోట్లకు కోట్ల రూపాయలను బీఆర్ ఎస్ పార్టీకి విరాళాలుగా ఇచ్చినట్టు తెలుస్తొంది. తాజాగా బీఆర్ ఎస్ ఆస్తులు ఎంత అనే విషయాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రస్తుతంబీఆర్ ఎస్ ఆస్తులు గత రెండేళ్లలో 1136 కోట్ల రూపాయలుగా తేలింది.
అయితే.. దీనిలో గత ఏడాది అంటే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 198 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఆరు మాసాల్లో మాత్రం రూ.938 కోట్లు విరాళాలుగా అందినట్టు పేర్కొంది. ఇది దేశంలో ఏ పార్టీకీ ఇంత తక్కువ సమయంలో అందలేదని కూడా పేర్కొంది. అయితే.. ఈ వివరాలను పరిశీలనలోకి తీసుకున్న అసోచామ్ సర్వే.. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర కీలక జిల్లాల్లో వ్యాపార వర్గాలు మరోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసినట్టు చెబుతోంది.
అందుకే లెక్కకు మిక్కిలిగా కోట్ల రూపాయల కనక వర్షాన్ని కురిపించినట్టు సర్వే వెల్లడించింది. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే.. తమ వ్యాపారాలు పుంజుకుంటాయని.. లేదా.. తమకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇలా భారీ ఎత్తున భూరి విరాళాలు సమర్పించి ఉంటారని అసోచామ్ వెల్లడించడం గమనార్హం. అయితే.. ఎవరు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారనే వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. కానీ, తాజాగా ఎన్నికల్లోకేసీఆర్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే.
This post was last modified on December 15, 2023 8:08 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…