Political News

ఏపీలో ఓట్ల రాజ‌కీయం.. త‌ల‌ప‌ట్టుకొన్న ఎన్నికల సంఘం

ఎన్నిక‌ల‌కు నాలుగు మాసాల గ‌డువు ఉండ‌గానే ఏపీలో ఓట్ల రాజ‌కీయం ఊపందుకుంది. అధికార పార్టీ వైసీపీపై ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, జ‌న‌సేన‌లు నిప్పులు చెరుగుతున్నాయి. త‌మ ఓట్లు తొల‌గిస్తున్నార‌ని.. దొంగ ఓట్లు చేరుస్తున్నార‌న్న‌ది ఈ రెండు పార్టీల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు లేఖ కూడా సంధించారు. ఈ వారంలోనే ఆయ‌న ఎన్నిక‌ల సంఘాన్ని నేరుగా క‌ల‌వాల‌ని అనుకున్నారు. కానీ.. ఈ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది.

ఇక‌, జ‌న‌సేన నాయ‌కులు కూడా రాష్ట్ర ఎన్నిక‌ల అధికారుల‌కు దొంగ ఓట్ల‌పై ఫిర్యాదులు చేశారు. త‌మ‌కు అనుకూలంగా ఉన్నార‌నే కార‌ణంగా..అనేక మంది ఓట్ల‌ను తొల‌గించార‌ని ఆధారాల‌తో స‌హా పార్టీ నాయ‌కులు నాదెండ్ల మ‌నోహ‌ర్ ఎన్నిక‌ల కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయ‌కులు ఉద్దేశ పూర్వ‌కంగా నే ఓట్లు తొల‌గించాల‌ని కోరుతూ.. ఫాం-7లు దాఖలు చేస్తున్నార‌ని కూడా ఆరోపించారు. మ‌రోవైపు వైసీపీ కూడా ఇదే వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చింది.

త‌మ పార్టీ అనుకూల‌, సానుభూతి ఓట్ల‌ను ఈ రెండు పార్టీలు ఫాం-7 ద్వారా తొల‌గిస్తున్నారని ఆ పార్టీ కూడా ఫిర్యాదులు చేసింది. అయితే.. వీటిపై రాష్ట్రస్థాయిలో అధికారులు కొన్ని చ‌ర్య‌లు తీసుకున్నారు. అయి న‌ప్ప‌టికీ.. సంతృప్తి చెంద‌ని అన్ని పార్టీలూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వివిధ రూపాల్లో ఫిర్యాదులు స‌మ ర్పించాయి. మ‌రో నాలుగు మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ఫిర్యాదుల గుట్ట‌లు చూసి ఎన్నిక‌ల సంఘం త‌ల‌పట్టుకుంది.

అధికార పార్టీ ప్ర‌తిప‌క్షాల‌పైనా.. ప్ర‌తిప‌క్షాలు అధికార పార్టీపైనా ప‌ర‌స్ప‌రం చేసుకున్న ఫిర్యాదుల‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌త్యేకంగా ఒక బృందాన్ని నియమించింది. ఈ బృందం వ‌చ్చే వారంలో ఏపీలో ప‌ర్య‌టించి.. అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై ఆరా తీయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన ఫిర్యాదులు.. క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాత‌.. నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 15, 2023 3:56 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago