తెలంగాణలో 10 సంవత్సరాలు పాలన సాగించిన.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు భద్రత తగ్గించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవానికి కేసీఆర్‌కు ఎలాంటి హెచ్చరికలూ లేవు. గతంలో కొంత మేరకు మావోయిస్టుల ప్రభావం ఉన్నా.. ఇప్పుడు ఆ ప్రబావం కూడా లేకపోవడంతో.. కేసీఆర్ ఎలాంటి హెచ్చరికల జాబితాలో కూడా లేరని ఆ పార్టీనే కొన్నాళ్ల కిందట(ఎన్నికలకు ముందు) ప్రకటించుకుంది.
అయితే.. సహజంలోనే సమాజంలో మారిన ప్రబుత్వం పట్ల అసంతృప్తి ఉంటుంది కాబట్టి.. మాజీ సీఎంగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రొటోకాల్ ప్రకారం భద్రత వంటివి కొనసాగుతాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఉన్న Z+ కేటగిరి భద్రతను Y కేటగిరిగా మార్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబందించి కేంద్ర హోం శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక, Z+ కేటగిరి భద్రతను Y కేటగిరిగా మార్చితే.. కేసీఆర్ భద్రతకు 4+4 సిబ్బందినే వినియోగిస్తారు. కాగా, ఇప్పటి వరకు డీఎస్పీ స్థాయి అధికారి.. కేసీఆర్ భద్రతకు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 4+4కు మారితో సీఐ స్థాయి అధికారికే పరిమితం అవుతారు. ఇక, కేసీఆర్ ఇంటి వద్ద సెంట్రీ యథాతథంగా ఉన్నా.. ఇక్కడ కూడా.. 12 నుంచి 8 మందికి సిబ్బందిని తగ్గిస్తారు. అదేవిధంగా ఆయన కాన్వాయ్‌లో రెండు పోలీసు వాహనాలు మాత్రమే ఉంటాయి.
అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వివరణ ప్రకారం.. ఇవన్నీ. కూడా హైదరాబాద్‌కే పరిమితం కానున్నాయి. ఆయన పొరుగు రాష్ట్రం లేదా.. ఏదైనా నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లాలకు వెళ్లాలని అనుకుంటే.. ప్రత్యేక భద్రతను కల్పిస్తారు. ఆ జిల్లా సిబ్బందితోపాటు.. ఆయనకు ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం Y కేటగిరి భద్రత ఇవ్వనున్నారు.
This post was last modified on December 15, 2023 3:43 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…