మామూలుగా అయితే వేటాడాలంటే వేటగాడికి చాలా ఓపిక, నేర్పు ఉండాలి. కానీ ఇక్కడ ఎరలు వేయకుండానే వేట జరిగిపోతోంది. దానికి కారణం ఏమిటంటే వేటాడే విషయంలో వేటగాడికి పెద్ద శ్రమలేకుండా వచ్చి వలలో పడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ముందు మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపైన పోలీసులు కేసులు పెట్టారు. అప్పులు ఎగ్గొట్టిన, కట్టాల్సిన బకాయిలు కట్టని కారణంగా జీవన్ పై కేసులు నమోదయ్యాయి. ఆస్తుల జప్తుకు నోటీసులు కూడా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
ఆ వేడి చల్లారకముందే మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఏ మల్లారెడ్డి మీద శామీర్ పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఏమి కేసంటే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎందుకంటే ఎస్టీల భూములు 47 ఎకరాల 18 గుంటలు ఆక్రమించుకుని సొంతం చేసేసుకున్నారట. నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన కొందరు ఎస్టీలు పోలీసుస్టేషన్లో మాజీమంత్రిపై ఫిర్యాదుచేశారు. భూకబ్జా ఆరోపణలపై మాజీమంత్రితో పాటు అనుచరులు ఆరుమందిపైన కూడా కేసులు నమోదయ్యాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదేళ్ళ బీఆర్ఎస్ అధికారంలో చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు. కంటికి కనబడినన్ని భూములు కబ్జాచేశారు. ఆ ఆక్రమణలకు గురైన భూముల్లో చెరువులు, కుంటలు కూడా ఉన్నాయి. ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూములను దేన్నీ వదలలేదు. భూకబ్జాలపై జనాలు ఎంత గోలచేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. దాంతో ప్రజాప్రతినిధులు మరింతగా రెచ్చిపోయారు.
అప్పటి ఫిర్యాదులన్నింటినీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుమ్ముతెలిపి బయటకు తీస్తోంది. అలాగే రకరకాలుగా అప్పులు తీసుకుని కొందరు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఇలాంటి ఫిర్యాదులపై రేవంత్ ప్రభుత్వం స్పీడుగా యాక్షన్ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జీవన్, మల్లారెడ్డిపైన కేసులు. పల్లా రాజేశ్వరరెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ తదితర నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నేతలపైన కూడా చాలా కేసులున్నాయి. వీటిన్నింటినీ ప్రభుత్వం బయటకు తీస్తోంది. నాలుగురోజులు పోతే ఇంకెంతమంది బాగోతాలు బయటకు వస్తాయో చూడాలి.
This post was last modified on December 15, 2023 12:11 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…