ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన పంచ్ కు.. జనసేన ఘాటుగా రియాక్టు అయ్యింది. ఆయన మాటకు అంతే ధీటుగా స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చేసింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువఓట్లు వచ్చాయంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్య చేయటం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన సభలో మాట్లాడిన జగన్..జనసేన మీదా.. అధినేత పవన్ మీదా విరుచుకుపడ్డారు. ప్యాకేజీ స్టార్ అంటూ తరచూ పంచ్ లు విసిరే ఆయన.. తాజాగా మ్యారేజ్ స్టార్ అంటూ కొత్త పదాన్ని కలిపారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన స్పందించింది.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి తెలంగాణలో వచ్చిన ఓట్ల మాటేంటి? అంటూ ప్రశ్నించటమే కాదు.. అందుకు తగ్గ ఆధారాల్ని చూపిస్తూ కౌంటర్ వేశారు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నోటా కంటే 56 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని జనసేన వెలుగులోకి తెచ్చింది. అంతేకాదు.. ఏ బర్రెలక్క పేరుతో పంచ్ వేసిన జగన్ కు ఆమె పేరు మీదనే విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్ కు.. వైసీపీకి లేదన్నారు. అదే విషయాన్ని తాజా వ్యాఖ్యలతో జగనే చెప్పుకున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. సెల్ఫ్ గోల్ వేసుకోవటం జగన్ కు మించిన సీబీఐ దత్తపుత్రుడు లేడంటూ మండిపడటం గమనార్హం. “2014 తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన ఓట్లు.. తెలంగాణ ప్రజలు నిన్ను రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా?” అంటూ గతాన్ని గుర్తు చేస్తూ వేస్తున్న ప్రశ్నల జోరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాము ధైర్యంగా నిలబడ్డామని.. ఏదో ఒక రోజు గెలుస్తామని పేర్కొన్న జనసైనికులు.. నీలా పారిపోలేదు.. రాళ్లతో కొట్టించుకోలేదంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. 2014లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో నోటా కంటే వైసీపీకి తక్కువగా వచ్చిన నియోజకవర్గాల జాబితాను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదంతా చూసినోళ్లు.. బర్రెలక్క ప్రస్తావన తెచ్చి జగన్ తప్పు చేశారన్న మాట వినిపిస్తోంది. కాస్తంత కసరత్తు చేసి విమర్శలు సంధిస్తే బాగుంటుందే తప్పించి.. ఇలా అడ్డదిడ్డంగా అనేస్తే.. అంతకు రెట్టింపు మాటల్ని పడాల్సి వస్తుందంటూ హితవు పలుకుతున్నారు.
This post was last modified on December 15, 2023 11:09 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…