తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసి పరిధిలో ముగ్గురు కొత్త కమిషనర్లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. మరోవైపు, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, ఆ ప్రచారాన్ని ఆమె ఖండిస్తూ మంత్రి సీతక్క బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, ఆమె స్థానంలో ఆమ్రపాలి వస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలికి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. దాంతోపాటు మూసీ డెవలప్మెంట్ సంస్థ ఇన్చార్జ్ ఎండిగా కూడా అదనపు బాధ్యతలను కేటాయించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలులోని అగ్రహారం గ్రామానికి చెందిన ఆమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా ఆమ్రపాలి పనిచేశారు. కాగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ శైలజ రామయ్యర్ ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఇదే సమయంలో హెచ్ఎండిఏ పరిధిలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ భూముల కోసం తప్పుడు రికార్డులు సృష్టించి కొందరు పొజిషన్ కోసం ప్రయత్నిస్తున్నారని దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ భూములన్నీ హెచ్ఎండిఏకే చెందుతాయని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on December 15, 2023 11:01 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…