కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీనీ వ్యతిరేకించే చాలామంది ముస్లింలు జనసేనను కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకులా చూడబోమని పవన్ క్లారిటీనిచ్చారు.
ముస్లింల అభివృద్ధి, అవసరాలకు అనుగుణంగా తమ విధివిధానాలు ఉంటాయని పవన్ చెప్పారు. రాబోయే ఎన్నికలలో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ముస్లింలకు పవన్ విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు అన్యాయం జరిగితే వారి వైపే నిలబడతానని, వారి పక్షాన గళం ఎత్తే నాయకుడిని తానే అవుతానని పవన్ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ చాలా నష్టపోయిందని, రాష్ట్రం బాగుపడాలంటే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. ఈ ఒక్కసారికి జనసేనను నమ్మాలని, ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లనని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం జనసేన-టీడీపీ పొత్తు కనీసం 10 ఏళ్లయినా కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. మంగళగిరిలో మొహిద్దిన్ సాధిక్ అనే ముస్లిం నేత జనసేనలో చేరిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ కు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా బన్నీ వాస్ ను పవన్ నియమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బన్నీ వాస్ కు నియామక పత్రాన్ని పవన్ స్వయంగా అందించారు. పార్టీకి ప్రచార విభాగం ఎంతో కీలకమని, సమన్వయంతో ఈ విభాగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని బన్నీ వాస్ కు పవన్ సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వినూత్న కార్యక్రమాలు, ప్రచారం రూపొందించాలని కోరారు. పార్టీ ఎదుగుదల కోసం మరింతగా కష్టపడాలని, పార్టీ ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. మెగా ఫ్యామిలీతో బన్నీ వాస్ కు సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 15, 2023 10:53 am
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…