ఉద్ధానం…ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేషెంట్లు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులను కిడ్నీ సమస్యలను వేధిస్తున్నాయి. ఈ మహమ్మారి వ్యాధిబారిన పడి వందలాదిమంది మృత్యువాత పడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఉద్ధానం బాధితులకు మాత్రం ఊరట లభించలేదు. గతంలో పలు ప్రభుత్వాలు ఆసుపత్రి నిర్మిస్తామని హామీలిచ్చినా…వాటిని మాత్రం నెరవేర్చలేదు. అయితే, ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్ ఉద్ధానం బాధితుల కష్టాలను స్వయంగా చూశారు. తాను అధికారంలోకి వస్తే ఉద్ధానం బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
ఈ క్రమంలోనే అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఉద్దానం బాధితులకు అండగా నిలబడ్డారు. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 50 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం నిర్మించింది. “డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్’ అంటూ ఉద్ధానం ప్రజల జీవితాలలో జగన్ వెలుగులు నింపారు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధికి మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక సిద్దమైంది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కంటే…రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్దం చేశారు.
పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం అందించారు. జగన్. ఉద్దానం ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయనున్నారు. ఈ నెల 14న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. తమ బతుకుపై ఆశ కలిగించిన జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు.
This post was last modified on December 13, 2023 9:54 pm
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే.…
ఇది పురుషాధిక్య సమాజం. నిజ జీవితంలోనే కాదు సినిమాల్లోనూ అదే కనిపిస్తుంది. అందుకే మార్కెట్, బిజినెస్ లెక్కలు హీరో మీద…
కీర్తి సురేష్ పెళ్లి గురించి గతంలోనూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె ఖండించింది. కొన్ని రోజుల కిందట మరోసారి…
అదానీతో విద్యుత్ ఒప్పందం, లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం రాష్ట్ర…
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు…
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నేళ్లలో వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొందో తెలిసిందే. ఆమె…