“కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి.. ఆరు మాసాల వరకు వేచి చూస్తాం. మౌనంగా అన్నింటినీ పరిశీలి స్తాం” అని చెప్పిన బీఆర్ ఎస్ పార్టీ నేతలు.. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే విమర్శలకు పదును పెంచేశారు. అప్పుడే సీఎం రేవంత్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించేశారు. రేవంత్ ఇచ్చిన హామీలు అలివిగానివని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉందని, ఎట్టి పరిస్థితిలోనూ రేవంత్‌ను వదిలి పెట్టేపరిస్థితి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని.. రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారని.. పదిరోజులు ఆగండి 15వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారని.. కాని ఇంకా ఇవ్వలేదని విమర్శించారు.
“మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామన్నారు ఏమైంది” అని మాజీ మంత్రి నిలదీశారు. రైతులకు రుణ మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసని గతాన్ని తవ్వుకొచ్చారు. ఇప్పుడు ఇదే హామీని ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు ఎలా చేస్తారో తాము కూడా చూస్తామని సవాల్ విసిరారు.
ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్ల అప్పుల్లో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆరు మాసాలు ఆగుతామని చెప్పిన కేటీఆర్.. అనూహ్యంగా విమర్శలు పెంచడం గమనార్హం.
This post was last modified on December 13, 2023 3:17 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…