తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్న కలలను సాకారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. సుదీర్ఘ విరామం తర్వాత.. సక్సెస్ అయింది. తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక, వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ప్రధాన సమస్యలను ఆలంబనగా చేసుకుని ఏపీలో చక్రం తిప్పేందుకు.. కాంగ్రెస్ అగ్రనాయకులు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖ ఉక్కు.. కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయం ముమ్మరం చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె ఈ నెల 26న విశాఖ పట్నం రానున్నట్టు పార్టీ వర్గాలకు సమాచారం అందింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ఆమె నాయనమ్మ ఇందిరా గాంధీ హయాంలో ఏర్పడిన ఈ పరిశ్రమను మోడీ సర్కారు ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
దీనిని అడ్డుకునేందుకు ఇప్పటికే ఉద్యోగులు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని నిర్మించి కొనసాగిస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్ పుంజుకునేలా ప్రియాంక ఇక్కడ భారీ సభలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇక, రెండోది అమరావతి. ఏపీకి ఇప్పుడు రాజధాని లేకుండా పోయింది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధాని చేయగా.. వైసీపీ ప్రభుత్వం దానిని తోసిపుచ్చింది. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
ఇప్పుడు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని, ఏపీ రాజధానిగా అమరావతికే మద్దతు ప్రకటించే క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఈ నెల 26నే అమరావతిలో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడకూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకులు సమాయత్తమ య్యారు. ఈ రెండు కీలక అంశాలపై పోరాటం చేయడం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయడంతోపాటు.. ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా.. దక్కేలా చేయాలనేది పార్టీ వ్యూహంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 12, 2023 3:50 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…