బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఎంఎల్ఏల్లో జీవన్ రెడ్డి కూడా ఒకరు. నిజామాబాద్ అసెంబ్లీ నుండి రెడ్డి పదేళ్ళు ఎంఎల్ఏగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో కేసీయార్ ఎందుకనో జీవన్ రెడ్దిని దూరంపెట్టారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే కొందరి బండారం బయటపడుతోంది. ఇందులో ముఖ్యంగా జీవన్ రెడ్డి వ్యవహారమంతా ఒక్కోటిగా వెలుగుచూస్తోంది. తాజాగా ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన విషయం బయటపడింది.
ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్ లో మాల్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోవటం, కరెంటు బిల్లులు ఎగ్గొట్టడం లాంటి ఘటనలపై ప్రభుత్వం రెండు నోటీసులు ఇచ్చింది. వాటికి అదనంగా ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు ఎగ్గొట్టిన విషయం బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే తన బార్య పేరుతో జీవన్ రెడ్డి 2017లో ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర రు. 20 కోట్లు అప్పు తీసుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు అసలు కానీ వడ్డీ కాని మాజీ ఎంఎల్ఏ కట్టలేదు. అసలుతో పాటు వడ్డీ కట్టాలని ఎన్నిసార్లు అధికారులు నోటీసులిచ్చినా లెక్కచేయలేదు.
అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. అయితే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో వెంటనే అధికారులు కొరడా ఝుళిపిచంటం మొదలుపెట్టారు. చెల్లించాల్సిన అప్పులపై కార్పొరేషన్ తాజాగా జీవన్ కు నోటీసులు జారీచేసింది. గడువులోగా అప్పు చెల్లించకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని నోటీసులో వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ అప్పు ఎందుకు తీసుకున్నారంటే ఆర్టీసీ బస్టాండులో మాల్ కట్టడానికి.
ప్రభుత్వాన్ని మ్యానేజ్ చేసుకున్న జీవన్ రెడ్డి ఆర్టీసీ స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. అందులో పెద్ద షాపింగ్ మాల్ కట్టారు. మాల్ కట్టి బిజినెస్ చేస్తున్నారు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అయితే కట్టడంలేదు. అలాగే వాడుతున్న కరెంటుకు కూడా జీవన్ రెడ్డి బిల్లులు చెల్లించలేదు. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. ప్రభుత్వం మారగానే అధికారులు ఒక్కసారిగా జీవన్ను నోటీసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ రు.10 కోట్లు చెల్లించాలి. అలాగే విద్యుత్ బిల్లులు రు. 2 కోట్లు కట్టాలి. బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన విద్యుత్ శాఖ ముందు కరెంటును కట్ చేసేసింది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మాల్ ను సీజ్ చేస్తామని మున్సిపాలిటి నోటీసుల్లో చెప్పింది. దానిమీద తాజాగా ఫైనాన్స్ కార్పొరేషన్ రు. 20 కోట్లు చెల్లించాలని నోటీసిచ్చింది.
This post was last modified on December 12, 2023 11:07 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…