Political News

ఆళ్ల రాజీనామా.. పైకి చెప్ప‌ని కార‌ణాలు ఎన్నో!

వైసీపీ కీల‌క ఎమ్మెల్యే, మంగ‌ళ‌గిరి శాస‌న స‌భ్యుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి హ‌ఠాత్తుగా ఉరుములు లేని పిడుగు మాదిరిగా వ్య‌వ‌హ‌రించి సంచ‌ల‌నం సృష్టించారు. త‌న శాస‌న స‌భ్య‌త్వానికి, అదేవిధంగా వైసీపీ స‌భ్య‌త్వానికి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. దీనిని బ‌హుశ ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. కాక‌పోతే.. అదినేత జ‌గ‌న్‌కు చెప్ప‌కుండా ఆయ‌న ఏమీ చేయ‌రు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు ముందుగానే చెప్పి ఉంటార‌ని కూడా ప‌రిశీల‌కులు అంటున్నారు.

ఇదిలావుంటే.. త‌న రాజీనామాలో ఆళ్ల.. కేవ‌లం ఏక వాక్యంతో స్పీక‌ర్‌కు లేఖ‌ను స‌మ‌ర్పించారు. మీడియా ముందు కూడా.. ఎక్క‌డా ప‌న్నెత్తు మాట ఎవ‌రినీ ఆయ‌న అన‌లేదు. అయితే.. ఇంత హ‌ఠాత్తుగా ఆయ‌న రాజీనామా చేయ‌డం వెన‌క మాత్రం కార‌ణాలు లేకుండా ఉంటాయా? అనేది వాస్త‌వం. ప్ర‌స్తుత రాజీనామా వెనుక‌ చాలానే కార‌ణాలు ఉన్నాయి. వీటిని ఆయ‌న పైకి చెప్ప‌క‌పోయినా.. గ‌త కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ఆయ‌న‌ను వేధిస్తున్నాయి.

ఇవీ కార‌ణాలు!

  • మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో సాక్షాత్తూ జ‌గ‌న్ ప్ర‌క‌టించి.. ఆ మాట నిల‌బెట్టుకోలేదు.
  • రెండో సారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలో క‌నీసం అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వ‌లేదు.
  • నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వ‌క‌పోవ‌డం(ఇది అంద‌రి బాధ‌)
  • త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న సోద‌రుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడి దూకుడు పెరిగింద‌నే ఆవేద‌న‌.
  • గతంలో మాదిరిగా పార్టీలో ఆళ్ల‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది.
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి వ‌చ్చిన గంజి చిరంజీవి(నేత కులం-బీసీ)కి టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌డం.
  • పార్టీ ప‌రంగా త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. క్షేత్ర‌స్థాయిలో త‌న‌పైనే ప‌రిశీల‌కుల‌ను పెట్ట‌డం.
  • తాను చేస్తున్న కోర్టు పోరాటాల‌కు సైతం నిధులు స‌మ‌కూర్చ‌లేద‌న్న ఆవేద‌న‌.
  • రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్నా.. త‌న‌కు స‌పోర్టుగా ఎవ‌రూ లేర‌నే బాధ‌.

This post was last modified on December 11, 2023 1:48 pm

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

4 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

4 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

5 hours ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

5 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

6 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

6 hours ago