ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇపుడిదే అంశం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఏపీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజే ప్రకటించారు కాబట్టి షర్మిల ఎంట్రీ నిజమే అని అనుకోవాలి. అయితే షర్మిల ఏ హోదాలో అడుగుపెట్టబోతున్నారన్నదే అర్ధం కావటంలేదు.
పార్టీ పగ్గాలు అందుకుంటేనే షర్మిల స్వేచ్చగా రాష్ట్రంలో తిరగ్గలరు. ఇదే సమయంలో ప్రధాన ప్రత్యర్థి గా సోదరుడు జగన్మోహన్ రెడ్డే అవుతారు. టీడీపీ, జనసేనతో కాంగ్రెస్ చేతులు కలపడం దాదాపు జరిగే పనికాదు. అందుకని కాంగ్రెస్ వామపక్షాలతో జతకట్టి లేకపోతే ఒంటరిగానో పోటీచేయాల్సుంటుంది. టీడీపీ, జనసేన-కాంగ్రెస్-బీజేపీ-వామపక్షాలు విడివిడిగా పోటీచేస్తే వైసీపీకే ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. అయినా ఇప్పుడు బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ కు ఓటుబ్యాంకంటు ఏమీలేదు. 2014లో జరిగిన రాష్ట్రవిభజన తర్వాత కాంగ్రెస్ నేలమట్టమైపోయింది.
భూస్ధాపితమైపోయిన కాంగ్రెస్ కు షర్మిల జవజీవాలు అందించగలరా అన్నది అనుమానమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలంటు ఎవరు లేరు. పార్టీ భూస్ధాపితమైపోయి, గట్టి నేతలు లేని పార్టీకి జనాలు ఎందుకు ఓట్లేస్తారు ? ఇప్పటికే తెలంగాణాలో పార్టీ పెట్టి ఫెయిల్యూర్ లీడరని షర్మిల ముద్ర వేయించుకున్నారు. అలాంటిది ఏపీ కాంగ్రెస్ ను షర్మిల తట్టిలేపుతారని ఎవరు అనుకోవటం లేదు. మరెందుకు ఏపీ కాంగ్రెస్ ద్వారా షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ? ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి షర్మిలకు తెలీందేమీ కాదు.
మరి తెలిసి కూడా తెలంగాణాను వదిలేసి ఏపీని కార్యస్ధానంగా ఎందుకు మార్చుకుంటున్నట్లు ? తెలంగాణాలో ఎప్పటికైనా తాను చెల్లని కాసన్న విషయం షర్మిలకు అర్ధమైపోయిందా ? ఎంత అర్ధమైపోయినా ఏపీలో ఏమి చేయగలరు ? అన్నది కీలకమైన ప్రశ్న. వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీలోని ఒకప్పటి కీలక నేతల్లో చాలామంది ఇపుడు వైసీపీలో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరూ షర్మిలతో కలిసి నడిచేందుకు ఇష్టపడరు. మరాలంటపుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏమి చేస్తారన్నదే అర్ధంకావటంలేదు.
This post was last modified on December 11, 2023 12:36 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…