Political News

న‌గ్న వీడియోలు బ‌య‌ట పెడ‌తా: పంజాబ్ సీఎం మాజీ భార్య

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్‌కు సొంత కుటుంబం నుంచి ప్ర‌తిప‌క్షాల కంటే ఎక్కువ‌గా సెగ పెరిగింది. ఆయ‌న రెండు వివాహాలు చేసుకున్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌.. ప్ర‌చారంలో త‌న‌కు స‌హ‌క‌రించి.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేసిన కార్య‌క‌ర్త‌నే ఆయ‌న రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. ఆ త‌ర్వాత నుంచి మొద‌టి వివాహానికి చెందిన భార్య‌, కుమార్తె,కుమారుడిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

ఇదిలావుంటే.. వివాహ స‌మ‌యంలో అడ్డుప‌డ‌ని మొద‌టి భార్య‌, పిల్ల‌లు.. ఇప్పుడు మాన్ రెండో స‌తీమ‌ణి గ‌ర్భం దాల్చ‌గానే రోడ్డెక్కారు. కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలోనే మాన్‌ను ఇటు మొద‌టి భార్య కుమార్తె సిర‌త్ బెదిరించ‌గా, త‌ర్వాత ఆయ‌న తొలి స‌తీమ‌ణి కూడా తీవ్రంగా హెచ్చ‌రించారు. రెండో భార్య‌కు అబార్ష‌న్ చేయించ‌క‌పోతే.. మాన్ నగ్న వీడియోల‌ను బ‌య‌ట పెడ‌తానంటూ.. తొలి భార్య ప్రీత్ గ్రేవాల్ తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. “అత‌ను ఆట మొద‌లు పెట్టాడు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా.. చూస్తూనే ఉండండి” అని ప్రీతి పోస్టు చేయ‌డం తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

ఎందుకిలా?

మాన్ సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నారు. బాగా సంపాయించార‌నే అంటారు. అయితే.. తొలి వివాహం ద్వారా జ‌న్మించిన పిల్ల‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోకుండా.. క‌నీసం భార్య అనుమ‌తి కూడా తీసుకోకుండానే రెండో వివాహం చేసుకున్నార‌నే ప్ర‌చారం ఉంది. అయితే.. సిక్కు మ‌తాచారం ప్ర‌కారం..అస‌లు రెండో వివాహ‌మే త‌ప్పు. మ‌రి అప్ప‌ట్లో ఎందుకో.. తొలి సంతానం, భార్య కూడా చూస్తూ ఉండిపోయారు. దీనికి రాజ‌కీయ ప‌ర‌మైన ఒత్తిడులు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

కానీ, ఇప్పుడు మాత్రం మాన్ త‌న ఆస్తిని రెండో భార్య‌కు ఇచ్చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే తొలి భార్య‌, పిల్ల‌లు.. రోడ్డెక్కార‌నేది పంజాబ్‌లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇదిలావుంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ.. ఇప్ప‌టికే మాన్‌పై నిరంత‌రం విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో మాన్ మాజీ భార్య‌, పిల్ల‌లు.. ఇలా రోడ్డున ప‌డ‌డం రాజ‌కీయంగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగా కూడా మాన్‌కు సంక‌టంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 11, 2023 8:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరల్డ్ కప్ పై గంభీర్ ఘాటు రిప్లై, వాళ్లిద్దరి గురించేనా?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…

13 minutes ago

పడయప్ప… తెలుగులో కూడా రావాలప్ప

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…

49 minutes ago

జగన్ చేసిన ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై అసలు దొంగ ఏమన్నాడో తెలుసా?

తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…

2 hours ago

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

3 hours ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

6 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

7 hours ago