Political News

రేవంత్‌కు చిక్కుముడి.. లాభం పార్టీకా.. రాష్ట్రానికా!

పార్టీ ప‌రంగా చూసుకుంటే.. కాంగ్రెస్ అతి పెద్ద జాతీయ పార్టీ. పైగా వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అధికా రంలోకి రావాల‌ని భావిస్తున్న పార్టీ కూడా. మ‌రీ ముఖ్యంగా ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న‌తో.. ఏపీలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన పార్టీ. అయితే.. ఇప్పుడు ఇచ్చామ‌ని చెబుతున్న తెలంగాణ‌లో ప‌దేళ్ల త‌ర్వాత‌.. పార్టీ అధికా రంలోకి వ‌చ్చింది. ఇక్క‌డ రేవంత్‌ను సీఎంను కూడా చేయ‌నుంది. అయితే.. ఈ స‌మ‌యంలోనే ఏపీలోనూ విస్త‌రించాల‌నేది పార్టీ ప్ర‌ణాళిక‌.

ఈ ప్ర‌ణాళిక ఎలా ఉన్నా.. ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు ఇప్ప‌టికే రేవంత్‌ను క‌లిసేందుకు అప్పాయింట్‌మెం ట్ రెడీ చేసుకున్నారు. ఇప్ప‌టికే రేవంత్‌తో చ‌ర్చించాల్సిన అంశాల‌ను కూడా గిడుగు రుద్ర‌రాజు వంటి నాయ‌కులు రెడీ చేసుకుని ప్రిపేర్ కూడా అయ్యారు. వీటిలో ప్ర‌ధానంగా.. ప్ర‌త్యేక హోదాకు.. రేవంత్ స‌హ‌క‌రించాల‌నేది.. వారి ప్ర‌ధాన డిమాండ్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పార్టీ పుంజుకోవాలంటే.. దీనికి మించిన బ్ర‌హ్మాస్త్రం లేద‌ని ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు భావిస్తున్నారు.

హోదా అంశాన్ని ఇప్పుడున్న ప్ర‌ధాన పార్టీలు వ‌దిలేశాయ‌ని.. దీనిని అందిపుచ్చుకుని.. ఏపీలో పుంజుకు నేందుకు బాటలు వేసుకోవ‌చ్చ‌ని.. నాయ‌కులు లెక్క‌లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రేవంత్‌పై ఒత్తిడి తేవాల‌నేది వారి ఉద్దేశం. ఎందుకంటే.. ఇప్ప‌టికే.. ఏపీకి హోదా ఇవ్వ‌డానికి వీల్లేదంటూ.. బీఆర్ ఎస్ త‌ర‌ఫున అప్ప‌టి ఎంపీ క‌విత‌.. సుప్రీంకోర్టులో కేసు వేశారు. అంతేకాదు.. పోల‌వ‌రంపైనా కేసులు వేశారు. ఇవి ప్ర‌భుత్వం త‌ర‌ఫునే ఆమె దాఖ‌లు చేశారు.

దీంతో రేపు రేవంత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశాక‌.. హోదా.. పోల‌వ‌రం రెండు అంశాల‌పైనా స్పందించాల‌ని.. హోదాను అడ్డుకోకుండా.. చూడాల‌ని.. అదేవిధంగా పోల‌వ‌రం ప్రాజెక్టుపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌కుండా ముందుకు సాగాల‌నేది ఏపీ నేత‌ల డిమాండ్‌. ఇక‌, రేవంత్ విష‌యానికి వ‌స్తే.. పార్టీపరంగా చూసుకుంటే.. ఏపీలో డెవ‌ల‌ప్ అయ్యేందుకు ఈ రెండు అంశాలు బాగానే ప‌నిచేస్తాయి.

కానీ, తెలంగాణ రాష్ట్ర‌పరంగా చూసుకుంటే.. అక్కడ ఆయ‌న‌కు ప్ర‌దాన చిక్కుముడిగా మార‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎటువైపు స్పందించినా.. స్పందించ‌క‌పోయినా.. ఆయ‌న‌కు ఇబ్బందే క‌నుక‌.. వీటిపై నాన్చుడు ధోర‌ణితోనే ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 6, 2023 5:48 pm

Share

Recent Posts

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

39 minutes ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

1 hour ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

2 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

6 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

7 hours ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

11 hours ago