ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులను ఆయన లైన్‌లోకి తీసుకున్నారు. “చెప్పం డి.. మీ మీ ప్రాంతాల్లో తుఫాను నష్టం ఎంత జరిగింది? మీమీ ప్రాంతాల్లో ఎంతమందిని శిబిరాలకు తరలించారు. వైద్య ఆరోగ్య సేవలు ఎలా ఉన్నాయి. శిబిరాల్లో ఉన్నవారికి సహాయక చర్యలు అందుతున్నా యా? ” అని ఆరా తీశారు.
మరీ ముఖ్యంగా రైతుల పరిస్థితిని పదే పదే అడిగి తెలుసుకున్నారు. ధాన్యం పలు ప్రాంతాల్లో తడిసి పోవడం.. రైతులు కన్నీరు పెట్టుకోవడం.. అదేసమయంలో ప్రతిపక్ష పార్టీలు.. వారిని ఓదార్చడం.. వంటివి మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి వెను వెంటనే మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి వారి నియోజకవర్గ పరిస్థితులను ఆరా తీశారు.
అయితే ఒక్క చెల్లుబోయిన వేణు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి మినహా.. ఎవరూ సరైన విధంగా స్పందించలేక పోయారని తెలిసింది. అంతేకాదు.. లెక్కలు కూడా చెప్పలేక పోయారు. ఇక, సహాయక శిబిరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారన్న ప్రశ్నలకు.. అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఏర్పాటు చేశారని చెప్పేశారు. కానీ, వాస్తవానికి చాలా వరకు ప్రభుత్వ స్కూళ్లు.. నీట మునగడంతో తిరుపతి, చిత్తూరు, నెల్లూరులో ప్రవేటు భవనాలను అద్దెకు తీసుకుని.. అక్కడ సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఈ విషయం తెలియని మంత్రులు.. ప్రభుత్వస్కూళ్లలో ఏర్పాటు చేశారనే సరికి సీఎంకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వారిపై మండిపడ్డారు. మీ తో వేగలేను. ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు సవ్యంగా నిర్వహించలేకపోతున్నారు. ఇప్పుడు ఆదుకోకపోతే.. గత నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన మంచి తుఫాన్‌తో కొట్టుకుపోతుంది. ఇప్పటికైనా వెళ్లండి. ప్రజలను పట్టించుకోండి! అని గట్టిగానే హెచ్చరించడం గమనార్హం.
This post was last modified on December 6, 2023 5:42 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…