Political News

రేవంత్ రెడ్డి సీఎం…అఫీషియల్

2 రోజుల ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ఎన్నుకుందని కాంగ్రెస్ నేత కేసీ వేణు గోపాల్ అధికారికంగా ప్రకటించారు. సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీ ఉదయం 10.28 నిమిషాలకు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన తెలిపారు. కేబినెట్ కూర్పుతో పాటు పోర్ట్ ఫోలియోల కేటాయింపుల కోసం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలని పార్టీ హై కమాండ్ నుంచి ఆహ్వానం అందింది.

ఈ క్రమంలోనే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎల్పీ నేతగా, సీఎం అభ్యర్థిగా రేవంత్ పేరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వేణుగోపాల్ చెప్పారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని, పార్టీలోని సీనియర్ నాయకులతో కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం సీనియర్లతో కలిసి పకడ్బందీ వ్యూహాలను రచించారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా భిన్నంగా ఉంది. ఆర్ఎస్ఎస్‌ నేతగా తన ప్రస్థానం మొదలుబెట్టిన రేవంత్ రెడ్డి 2001-02 మధ్య టీఆర్ఎస్ కార్యకర్తగా పని చేయడం విశేషం. 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించిన రేవంత్ కు నిరాశ తప్పలేదు. 2006లో జ‌డ్పీటీసీ ఎన్నికల్లో కూడా టికెట్ దక్కకపోవడంతో టీఆర్ఎస్ కు రేవంత్ గుడ్ బై చెప్పారు. 2008 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి యాక్టివ్‌గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు..రేవంత్ కు కొడంగల్ టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడినా రేవంత్ రెడ్డి గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో కూడా గెలిచిన రేవంత్…2018లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇపుడు నరేందర్ రెడ్డిని ఓడించి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు.

This post was last modified on December 5, 2023 8:07 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

11 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

48 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago