Political News

గ‌తంలో జ‌గ‌న్‌.. ఇప్పుడు రేవంత్‌.. రేపు బాబు?

అదేంటి? అనుకుంటున్నారా? నిజ‌మే. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్న ఓ చిత్రం .. ఈ విష‌యాన్ని ఆస‌క్తిగా మార్చింది. కీల‌క నాయ‌కులు జైలుకు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌హ‌జంగానే వారిపై సింప‌తీ వ‌స్తుంది. ఇది ఏకంగా వారిని అధికారం వ‌ర‌కు న‌డిపించ‌డం ఇప్పుడు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంటుంది. స‌ద‌రు నాయ‌కులు ఏ కేసులో జైలుకు వెళ్లార‌న్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానం కాదు.. త‌మ‌ నాయ‌కుడిని జైలు పాలు చేశారు!అనేదే సింప‌తీ!! ఇదే వ‌ర్క‌వుట్ అవుతోంది. నాయ‌కుల‌కు క‌లిసి వ‌స్తోంది.

గ‌తంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అక్ర‌మాస్తుల కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను 16 నెల‌ల‌పాటు చంచ‌ల్‌గూడ జైల్లో ఉంచారు. అయితే.. ఇది తీవ్ర‌మైన నేర‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. ఇప్ప‌టికీ ఈ కేసులు మాత్రం కొలిక్కి రాలేదు. కానీ, ప్ర‌జ‌ల్లో మాత్రం జ‌గ‌న్‌కు విప‌రీత‌మైన క్రేజ్ పెరిగిపోయింది. ప‌లితంగా 2019లో ఆయ‌న‌కు సీఎం ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. అధికారం అప్ప‌గించారు.

ఇక‌, తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన రేవంత్ రెడ్డి కూడా.. 2015-16 మ‌ధ్య కాలంలో జైలు జీవితం గ‌డిపిన నాయ‌కుడే. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం.. నామినేటెడ్ ఎమ్మెల్యేకు న‌గ‌దు ఇస్తూ.. ఆయ‌న దొరికిపోయారు. అప్ప‌ట్లో ఇది తీవ్ర చ‌ర్చ‌కు, వివాదానికి కూడా దారి తీసింది. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజులు ఆయ‌న జైల్లో ఉన్నారు. ఆ త‌ర్వాత బెయిల్‌ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీనే ఆయ‌న అధికారంలోకి తీసుకువ‌చ్చారు. తాను కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు.

నెక్ట్స్ ఎవ‌రు?

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నెక్ట్స్ ఇదే కోవ‌లో అధికారంలోకి వ‌చ్చేదెవ‌రు? అనే చ‌ర్చ రాజ‌కీయంగా జోరుగా సాగుతోంది. దీనిని గ‌మ‌నిస్తే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇటీవ‌లే ఆయ‌న జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కుంభ‌కోణానికి సంబంధించి వైసీపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను అరెస్టు చేయించ‌డం.. జైలుకు త‌ర‌లించ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న బెయిల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ బెయిల్‌పై చంద్ర‌బాబున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌తంలో జ‌గ‌న్‌.. ఇప్పుడు రేవంత్‌.. రేపు బాబు అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని నెటిజ‌న్లు ఆస‌క్తిగా రియాక్ట్ అవుతున్నారు.

This post was last modified on December 5, 2023 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూరిక్ యాసిడ్ సమస్యలకు జీలకర్రతో ఇలా చెక్ పెట్టండి..

ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…

3 hours ago

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

11 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

11 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

13 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

14 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

14 hours ago