రాజకీయాల్లో నాయకులు అనుసరించని వ్యూహాలంటూ ఉండవు. సమయానికి తగిన విధంగా నాయకులు తమ వ్యూహాల కత్తులకు పదును పెడతారు. అందునా.. ఎన్నికలంటే మరింత ఎక్కువగా వ్యూహాలకు తెరదీ స్తారు. ఈ వ్యూహాలు అవి.. ఇవి.. అనే తేడా ఉండదు. సమయానికితగిన విధంగా ఏదైనా ఉండొచ్చు. గెలుపు గుర్రం ఎక్కడమే పరమావధి, ప్రత్యర్థిని చిత్తు చేయడమే మూల మంత్రం.
ఇదే ఫార్ములాను ఎంచుకున్నారు.. హుజరాబాద్ నుంచి విజయం దక్కించుకున్న పాడి కౌశిక్‌రెడ్డి. హుజూరా బాద్‌లో పాడి గెలుపు అంత ఈజీగా ఏమీ దక్కలేదు. పైగా.. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడిగా పేరున్న ఈటల రాజేందర్‌తో పోటీ.. ఇప్పటికే ఒకసారి వెంటాడిన వోటమి. ఈ సారీ గెలవకపోతే.. నేరుగా కేసీఆర్‌కు దగ్గరకు వెళ్లే చనువుకు.. తెరపడే అవకాశం. మరో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిన దుస్థితి.
వెరసి మొత్తంగా.. పాడి కౌశిక్‌రెడ్డికి ప్రస్తుతం జరిగిన ఎన్నికల తాడోపేడో అన్నట్టుగా చావో రేవో అయిపో యాయి. అందుకే ఆయన ఆది నుంచి పక్కా ప్లాన్‌తోనే ముందుకు కదిలారు. నియోజకవర్గం ప్రజలను కలు సుకున్నారు. కుమార్తె, సతీమణితో కలిసి.. దణ్ణాలు పెట్టారు. ఓట్టు వేయమని అభ్యర్థించారు. అంతేకాదు.. ఆయన సతీమణి ఏకంగా జోలె కూడా పట్టింది. ఓటును అర్థించింది.
అయితే.. జనాలు నవ్వారు. చాల్చాలేవయ్యా! అన్నారు. దీంతో విసిగిపోయిన పాడి కౌశిక్‌రెడ్డి.. సెంటిమెంటు అస్త్రాన్ని ఒక్కసారిగా దూశారు. మరో రెండు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా.. నన్ను గెలిపిస్తే.. జైత్ర యాత్ర.. లేకపోతే శవయాత్ర
అంటూ.. సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కదిలించేసింది. అంతే అప్పటి వరకు ఫామ్‌లో ఉన్న మాజీ మంత్రి ఈటల కొట్టుకుపోయారు. ఫలితాల ఒరవడిలో పాడి గెలుపు గుర్రం ఎక్కారు.
చివరాఖరుకు..
చివరాఖరుకు.. చెప్పేదేంటంటే.. జనాలు దణ్ణాలు పెడితే.. కొంత వరకు మొగ్గుతారో.. జోలె పడితే ఇంకొంత మొగ్గుతారేమో… కానీ, సెంటిమెంటు అస్త్రానికి ఫుల్లుగా పడిపోతారన్నమాట.!
This post was last modified on December 4, 2023 5:57 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…