తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్రమైన జంపింగుల వ్యవహారం అందరికీ తెలిసిందే. చివరి నిముషం వరకు కూడా నాయకులు పార్టీలు మారేసి.. జెండా మార్చేసి.. కండువాలు కప్పేసుకున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఇప్పుడు అలమటిస్తున్నారు. అయ్యోమారకుండా ఉంటే బాగుండేది కదా! అని బాధపడుతున్నారు. దీనికి కారణం.. మారిన పార్టీ అధికారంలోకి రావడమే!
అదేవిధంగా పార్టీ ఓడిపోకుండా.. అధికారంలోకి వచ్చి ఉంటే.. కొందరు ఖచ్చితంగా మంత్రులు అయ్యేవా రు. వీరిలో తొలిసారి విజయం దక్కించుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరికి ఖచ్చితంగా మంత్రులు పదవి దక్కేది. ఈ మేరకు కేసీఆర్ సైతం వారికి హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అయితే.. అలాంటి పార్టీ ఓడిపోయింది. అధికారంలోకి రాకుండా పోయింది. ఈ రెండు వైరుధ్యాలు కూడా.. చిత్రంగా ఉన్నప్పటికీ నిజం.
బీఆర్ ఎస్ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న పాడి కౌశిక్‌రెడ్డి ఆవేదన అంతా ఇంతాకాదు. ఒక పెద్ద మెగా లీడర్‌ను ఓడించాననే ఆనందం ఉన్నా.. దీనికి తగిన ఫలితం మంత్రి పదవిని అందుకునే అవకాశం లేకుండా పోయింది. “నువ్వు పోయి.. గెలిచిరా.. మంత్రిని చేస్తా” అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పటికీ పాడి చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో కసిపెట్టి ప్రచారం చేసి.. సెంటిమెంటు అస్త్రంతో గెలుపు గుర్రం ఎక్కారు. కానీ ప్రయోజనం లేదు. పార్టీ ఓడిపోవడంతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. “ఉండన్నా.. మేం చూసుకుంటాం. పార్టీ అధికారంలోకి రాగనే నీకు ప్రాధాన్యం ఉంటుంది” అని రేవంత్ ఎంత నచ్చజెప్పినా.. వినిపించుకోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారిపోయారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన కనుక పార్టీ మారకుండా ఉండి ఉంటే.. ఏదో ఒక పదవి ఆయనకు దక్కడం ఖాయమని అంటున్నారు. సో.. ఇలా రెండు పార్టీల్లోనూ చాలా మంది ఉన్నారు. మొత్తానికి “పార్టీ ఓడి వీరు.. పార్టీ మారి వారు..” మంత్రిపదవులు పోగొట్టుకున్నారు.
This post was last modified on December 4, 2023 5:05 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…