Political News

తెలంగాణ‌పై కాంగ్రెస్ ముద్ర‌.. 40 ఏళ్ల‌లో గెల‌వ‌ని స్థానాల్లోనూ!!

తెల‌గాణ‌పై కాంగ్రెస్ ముద్ర స్ప‌ష్టంగా క‌నిపించింది. కేవ‌లం అధికారంలోకి రావ‌డ‌మే కాదు.. ఎవ‌రూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు ఒకింత ఎక్కువ‌గానే కాంగ్రెస్ త‌న స్థిర‌త్వాన్ని నిల‌బెట్టుకుం ది. తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకొనే ప‌రిస్థితి నుంచి తెలంగాణ అధికారాన్ని కైవ‌సం చేసుకునే ప‌రిస్థితి వ‌డివ‌డిగా అడుగులు వేసింది. మొత్తం 119 స్థానాల్లో మేజిక్ ఫిగ‌ర్ 60 దాటుకుని.. మ‌రో 4అద‌నంగా త‌న బ్యాగ్‌లో వేసుకుంది.

మొత్తానికి సుస్థిర‌మైన ప్ర‌భుత్వ‌మే ఇప్పుడు తెలంగాణలో ఏర్ప‌డింది. అయితే.. ఇక్క‌డ మ‌రో విశేషం కూడా ఉంది. కొత్త‌వారిని గెలిపించుకోవ‌డంతోపాటు.. దాదాపు 40 ఏళ్లుగా బోణీ కొట్ట‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్క‌డం విశేష‌మే అని అంటున్నారు ప‌రిశీల‌కులు. 1983 నుంచి ప‌రిశీలిస్తే.. తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ ప‌డుతూ లేస్తూ వ‌స్తోంది. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో స్థానాల‌ను పార్టీ కైవసం చేసుకున్న దాఖ‌లా లేదు.

కానీ, ఈ ద‌ఫా రేవంత్ సునామీ కావొచ్చు.. 6 గ్యారెంటీల ప‌థ‌కాలు కావొచ్చు.. స‌మ‌ష్టి కృషి కావొచ్చు.. పేరు ఏదైనా.. పార్టీకి మేలు జ‌రిగింద‌నే అంటున్నారు. గ‌తంలో గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ విజ‌యం దక్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

1983లో 43 సీట్ల‌కే ప‌రిమిత‌మైన పార్టీ.. 1985 ఎన్నిక‌ల్లో మ‌రింత దారుణంగా 14 స్థానాలే ద‌క్కించుకుంది. ఇక‌, 1989 నాటికి పుంజుకుని 57 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, త‌ర్వాత జ‌రిగిన 1994 ఎన్నిక‌ల్లో 10 స్థానాల‌కు కుదించుకుంది. ఇక‌, 1999 ఎన్నిక‌ల్లో 43, 2004లో 54, 2009లో 50 స్థానాలు ద‌క్కించుకుంది. ఇక‌, తెలంగాణ ఆవిర్భ‌వించిన 2014లోనూ కేవలం 21 స్థానాల‌కే ప‌రిమితమైంది.

గ‌త 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 19 స్థానాలే ద‌క్కించుకుంది. కానీ, ఇప్పుడు ఈ రికార్డుల‌ను చెరిపేసి స‌రికొత్త దిశ‌గా .. అడుగులు వేసి.. ఏకంగా 64 స్థానాల్ల విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. వీటిలో మునుపెన్న‌డూ గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on %s = human-readable time difference 11:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దీపావళి 2024 విజేత ఎవరు

పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…

2 hours ago

పుష్ప-2.. మ్యాడ్ రష్ మొదలైంది

ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి అనుకున్న స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’, జులైలో ‘కల్కి 2898 ఏడీ’,…

3 hours ago

‘కంగువా’ – అంబానీ కంపెనీలో అప్పు కేసు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ విడుదలకు ముందు అడ్డంకులు ఎదురవుతున్నాయి. శివ దర్శకత్వంలో…

4 hours ago

గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి పద్మ కేసు

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యత…

4 hours ago

ఇరకాటం తెచ్చి పెట్టిన సంక్రాంతి టైటిల్

మొన్న వెంకటేష్ 76 సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో పాటు సంక్రాంతి విడుదలని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్…

5 hours ago

వరుణ్ తేజ్ చేయాల్సింది ఇలాంటి ‘మట్కా’లే

https://www.youtube.com/watch?v=FKtnAhHnfUo ఏవేవో ప్రయోగాలు చేయబోయి, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నానుకుని వరస డిజాస్టర్లు చవి చూసిన వరుణ్ తేజ్ ఎట్టకేలకు…

6 hours ago