తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసులరెడ్డి తన చాలెంజ్ ను నిలుపుకున్నారు. ఎన్నికలకు ముందు దాదాపు రెండు నెలల క్రితమే కేసీయార్ ను ఉద్దేశించి పొంగులేటి ఒక చాలెంజ్ చేశారు. అదేమిటంటే ఖమ్మం జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ను గెలవనివ్వనని. తాజాగా వెల్లడైన పలితాల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐలే గెలిచాయి. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది.
తాజా ఫలితాలు చూసిన తర్వాత పొంగులేటి తన చాలెంజ్ ను నిలుపుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. పొంగులేటి చాలెంజ్ పై కేసీయార్ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించారు. పొంగులేటి చాలెంజ్ పై కేసీయార్ చాలా సెటైర్లు వేయటమే కాకుండా చాలా తక్కువ అంచనా వేశారు. అయితే ఫలితాలు చూసిన తర్వాత పొంగులేటిని అందరు శెభాష్ అనంటున్నారు. నిజానికి భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకటరావు కూడా పొంగులేటి మద్దతుదారుడే.
ఇక్కడ విషయం ఏమిటంటే ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోను పొంగులేటికి అపారమైన పట్టుంది. ప్రతి నియోజకవర్గంలోను పొంగులేటికి పెద్దఎత్తున మద్దతుదారులున్నారు. 2014లో వైసీపీ తరపున పోటీచేస్తేనే ఒక ఎంపీతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలు గెలిచారు. అప్పుడే పొంగులేటి పట్టేంటో బయటపడింది. తర్వాత తన పట్టును మరింతగా విస్తరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించారు. పొంగులేటిని దూరంచేసుకోవటమే కేసీయార్ చేసిన పెద్ద తప్పు. దీనికి అదనంగా తుమ్మల నాగేశ్వరరావును కూడా పార్టీలో నుండి వెళ్ళిపోయేట్లు చేశారు.
దాంతో పొంగులేటి, తుమ్మల ఇద్దరు కేసీయార్ కు వ్యతిరేకంగా తయారయ్యారు. అసలే జిల్లా అంతా మంచి పట్టున్న పొంగులేటికి తుమ్మల కూడా తోడయ్యారు. దాంతో ఇద్దరు కలిసి మొత్తం జిల్లాలోని తమ మద్దతుదారులను, అనుచరులు, క్యాడర్ను బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కూడగట్టారు. దాంతో పాలేరు, ఖమ్మంలో పొంగులేటి, తుమ్మల భారీ మెజారిటితో గెలవటమే కాకుండా మిగిలిన అభ్యర్దులను కూడా గెలిపించుకున్నారు. భద్రాచలంలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకటరావు కూడా పొంగులేటి మద్దతుదారుడే. కాబట్టి ఏదోరోజు తెల్లం కాంగ్రెస్ లోకి వచ్చేయటం ఖాయమనే ప్రచారం మొదలైంది.
This post was last modified on %s = human-readable time difference 11:03 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…